28.7 C
Hyderabad
May 6, 2024 07: 05 AM
Slider ప్రత్యేకం

కరోనా ఎఫెక్ట్: స్కూళ్లు బహిరంగ స్థలాలు, బార్లు, క్లబ్బులు బంద్

kcr cs

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఏ పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనడానికిం సిద్ధంగా  ఉందని ఆయన తెలిపారు. ప్రగతి భవన్ లో నేడు ఆయన మీడియా సమావేశంలో కరోనా వైరస్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు.

ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన విస్తృత సమావేశం, తర్వాత దాదాపు 3 గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. కరోనా వైరస్ కు సంబంధించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి తెలిపారు.

దేశంలో పుట్టిన వైరస్ కాదు, ఎక్కడో చైనా లో పుట్టింది. మన దగ్గర ఎలాంటి పాజిటివ్ కేస్ లు లేవు, ఒక్కటి వచ్చింది అది కూడా నెగిటివ్ వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే గాంధీ లో చికిత్స పొందుతున్నాడని ఆయన తెలిపారు. జనాలు ఎక్కువగా ఉన్న ఏరియాలకు వెళ్లవద్దని ఆయన తెలిపారు.

నేటి నుండి మార్చి 31 వరకు జనాలు ఎక్కువ ఉండే ప్రాంతాలు బందు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విద్య సంస్థలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇతర పరీక్ష లు యధావిధిగా ఉంటాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో ఉండే విద్యార్థులు పరీక్షలు రాస్తారు మిగతా విద్యార్థులు ఇంటికి వెళ్తారు. అదే విధంగా ఫంక్షన్ హాల్ లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే పెళ్లి డేట్ పిక్స్ అయితే పెళ్లిళ్లు చేసుకోవచ్చు. అన్ని మ్యారేజ్ హాల్స్ మార్చ్ 31 తరువాత జరిగే హాల్స్ కి బుకింగ్ ఇవ్వవద్దని ఆయన తెలిపారు. బహిరంగ సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ముఖ్యమంత్రి తెలిపారు. స్పోర్ట్స్, జూ పార్క్ ఇండోర్ స్టేడియంలు మూసివేయాలని కోరుతున్నాం, అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Related posts

మోడీ నియంతృత్వ విధానాలపై మరో స్వాతంత్ర్య పోరాటం

Satyam NEWS

ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రయివేట్ ఆసుపత్రులు

Satyam NEWS

Leave a Comment