దేవదేవులే రథంపై ఆసీనులై భక్తులకు చెంతకు అభయమిస్తూ ముందుకు సాగుతుండగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రం వేములవాడ లోని పురవీధులు భక్తి పారవశ్యం తో పులకించిపోయాయి. దేవాలయం లో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణం ఉత్సవాల్లో భాగం గా శనివారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ రాజరాజేశ్వర స్వామి , క్షేత్ర పాలకుడు అనంత పద్మనాభస్వామి శ్రీ లక్ష్మీతాయారమ్మ ల రథోత్సవం అత్యంత నేత్రపర్వం గా సాగింది.
దారి పొడువునా మహిళలు మంగళ హారతులతులతో నీరాజనాలు పలుకగాఉత్సవ మూర్తులు వారిని ఆశీర్వదీస్తూ ముందుకు సాగింది.భక్తులు ఆనందము తో నృత్యాలతో సందడి చేశారు.స్థానాచార్యులు అప్పల భీమా శర్మ నేతృత్వంలోని ఆలయ అర్చకులు బృందం వేదపండితులు వేణుగోపాల స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకు వక్కలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణవేణి ,దేవాలయ సిబ్బంది పాల్గొనగా పట్టణము లో రోడ్డుకు ఇరువైపులా భక్తులు స్వామివారిని దర్శించుకుందుకు బారులు తీరారు.