రాష్ట్రంలో జరుగుతున్న జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు చరిత్రాత్మకమని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు అకేపాటి అమరనాధరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నుండి వైఎస్ జగన్ వరకు ఆయన కుటుంబానికి విధేయునిగా ఉన్నానని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ముందు నుండి తోడుగా నిలబడ్డానని చెప్పారు.
జడ్పీ చైర్మన్ పదవికి తనను ప్రతిపాదించడం సంతోషంగా ఉందని అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఏ బాధ్యత అప్పగించినా హృదయపూర్వకంగా స్వీకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధి కి సాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీర్వాదం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిస్తానని ఆయన అన్నారు. కడప జిల్లాలో చాలా మండలాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షణీయం అన్నారు.