42.2 C
Hyderabad
April 26, 2024 16: 11 PM
Slider ప్రత్యేకం

మొక్క జొన్న రైతుల మహా ధర్నా ఉద్రిక్తం

#Maiz Farmers

మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు సన్నరకం వరి పంటకు మద్దతు ధర కల్పించాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తలకు దారి తీసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైతుల ఆందోళన కొనసాగింది. ధర్నా వద్దకు కలెక్టర్ రాకపోవడంతో రైతులే భారీ ర్యాలీగా కలెక్టరేట్ వరకు తరలివెళ్లగా పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై ఆందోళన

జిల్లా కేంద్రంలోని టెక్రియల్ 44 వ జాతీయ రహదారిపై మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ధర్నాలో సుమారు మూడు వేల మంది రైతులు పాల్గొన్నారు. ఉదయం 11:30 గం.లకు మొదలైన ఆందోళన ఐదు గంటల పాటు ఏకధాటిగా కోనసాగింది. కలెక్టర్ వచ్చే వరకు రహదారిని వదిలే ప్రసక్తి లేదని జాతీయ రహదారిని ఐదు గంటల పాటు దిగ్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కుళ్ళిన మొక్కజొన్నతో నిరసన

కుళ్ళిన మొక్కజొన్న విత్తనాలను రోడ్డుపై వేసి వేలాది మంది రైతులు నిరసన చేపట్టారు. మొక్కజొన్న ఇలా ఉంటే తాము ఎలా బతకాలని రైతులు ప్రశ్నించారు. బస్తాలో తీసుకువచ్చిన మొక్కజొన్న విత్తనాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు.

పోలీసుల భారీ బందోబస్తు

వేలాది మంది ధర్నాలో పాల్గొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డి డిఎస్పీ శశాంక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను భారీగా మోహరించారు. రైతులంతా రహదారిని దిగ్బంధించడంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలివెజిపోయాయి. దాంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. గతంలో 1760 రూపాయలకు క్వింటాల్ మొక్కజొన్న ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ప్రస్తుతం కేంద్రం పెంచిన 90 రూపాయలు కలిపి 1850 కి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో క్వింటాలుకు 8 వందలు 9 వందలకు కొనుగోలు చేస్తుండటంతో  క్వింటాలుకు 7 వందల రూపాయల చొప్పున 25 వేల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే పదివేల రైతు బంధు ఏ కోశాన కూడా సరిపోదన్నారు.

సన్నరకం వేయాలని ప్రభుత్వమే చెప్పింది

నియంత్రిత పంటల సాగులో భాగంగా సన్నరకం పండించాలని చెప్తే ప్రభుత్వ సూచన ప్రకారమే రైతులు పంటలు వేశారని రైతులు తెలిపారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం సన్నరకం పంటకు ధరను నిర్ణయించలేదని అన్నారు. క్వింటాలు సన్నరకం వరి ధాన్యాన్ని 2500 లకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్త ధర్నాకు దారితీస్తుంది

ఈ ధర్నా జగిత్యాలలో ప్రారంభమై కామారెడ్డి వరకు చేరిందని, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను కొనసాగుతాయని తెలిపారు. అయినా స్పందించకపోతే సీఎం కేసిఆర్ నిర్మించుకున్న కొత్త ఇంటివద్ద పంచాయతీ పెట్టుకుంటామని హెచ్చరించారు.

కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం

ఐదు గంటల పాటు కొనసాగిన ఆందోళన వద్దకు కలెక్టర్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఒక్కసారిగా రైతులు కలెక్టరేట్ వైపు ర్యాలీగా పరుగుపెట్టారు. ఈ క్రమంలో బైపాస్ చౌరస్తా వద్ద రైతులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. కలెక్టరేట్ కు వెళ్లే దారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య భారీగా తోపులాట చోటుచేసుకుంది. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినా రైతులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు రైతులు బైఠాయించి కలెక్టర్ బయటకు రావాలని, కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినిపించుకోలేదు.

ముగ్గురు రైతులకు గాయాలు

కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టడంతో ముగ్గురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ గాయలతోనే రైతుకు కలెక్టర్ కార్యాలయానికి పరుగులు తీశారు. తమకు టైలిన గాయాలను మీడియాకు గాయాలను చూపించారు. ఓ రైతు కలెక్టర్ కార్యాలయం గేటు ముందు స్పృహతప్పి పడిపోయాడు. దాంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంట తర్వాత ఇంచార్జ్ ఆర్డీఓ శ్రీను నాయక్ బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. రైతుల నుంచి వినతిపత్రం తీసుకుని పై అధికారులకు నివేదిక పంపిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. దాంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

ఆసుపత్రిలో చేరనున్న ఎం ఎస్ ధోని

Satyam NEWS

టోల్ ఫ్రీ తో కొత్త సమస్య

Sub Editor 2

రాజంపేట లో మద్యం దుకాణం వద్ద టీడీపీ ధర్నా

Satyam NEWS

Leave a Comment