40.2 C
Hyderabad
May 1, 2024 16: 22 PM
Slider ప్రత్యేకం

తొలిసారిగా “ఖాకీ” వనంలో తెలుగు భాషా దినోత్సవం…!

#teluguday

విజయనగరం కు ఆ స్టేషన్ కీలకమైంది. జిల్లా ఏర్పడినప్పటి నుంచీ…. ఎంతో మంది… అక్కడే పని చేసి… ఆ స్టేషన్ ప్రతిష్ఠతో పాటు… తమ ,తమ ప్రజ్ఞ పాటవాలను శాఖ ద్వారా చూపించారు. అయితే ఎప్పుడూ నిందితులను పట్టుకుని స్టేషన్ లో ఉంచి విచారణలు చేయడం అలాగే ఫిర్యాదు దారులతో అను నిత్యం… నేరా పరంపర తో  బిజీగా ఉండే ఆ స్టేషన్ లో వినూత్నంగాఓ బృహత్తర కార్యక్రమం జరిగింది… కాదు కాదు… నిర్వహించారు… ఆ స్టేషన్ సీఐ.ఆ స్టేషనే…విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషన్.. ఆ స్టేషన్ కు సీఐగా వచ్చిన డాక్టర్ వెంకటరావు… సాహిత్యం తో పట్టా పొందడం..అందున…తెలుగు సాహిత్యాన్ని అవపోసిన పట్టిన పోలీసు ఆఫీసర్ కావడంతో… తెలుగు భాషా దినోత్సవం… అదీ వన్ టౌన్ స్టేషన్ లో తొలిసారిగా నిర్వహించడం విశేషమని అంటోంది…”సత్యం న్యూస్. నెట్”.

జిల్లా ఎస్పీ అనుమతి తో….స్టేషన్ లో పని చేసే ప్రతీ ఒక్కరూ.. ఈ దినోత్సవం లో పాల్లొనడం విశేషం. . ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ డా. బి.వెంకటరావు మాట్లాడుతూ – గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి కీ.శే.లు గిడుగు వెంకట రామమూర్తి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడని అన్నారు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది అయిన రామ్మూర్తి గారు శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు.

గిడుగు రామ్మూర్తి గారి ఉద్యమం వల్ల కొద్దిమందికి మాత్రమే పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైందన్నారు. తెలుగు భాషోద్యమం కు గిడుగు రామ్మూర్తి గారు చేసిన కృషికిగను ఆయన జయంతి అయిన ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నామని సీఐ బి.వెంకటరావు ఆన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు వి.అశోక్ కుమార్, ఎస్.భాస్కర రావు, గణేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు తల్లి చిత్ర పటానికి పోలీసు అధికారులు, సిబ్బంది పూలను సమర్పించి, గిడుగు వేంకట రామ్మూర్తి గారికి ఘనంగా నివాళులు అర్పించారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుపోతా

Bhavani

జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే

Satyam NEWS

రెండేళ్లలో అనేక ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు

Sub Editor

Leave a Comment