21.7 C
Hyderabad
December 2, 2023 03: 58 AM
Slider ఆదిలాబాద్

అర్చకులకు తీపికబురు: గౌర‌వ వేతనం రూ. 10 వేల‌కు పెంపు

#Dhupa Deepa Naivedya

అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం క్రింద గౌర‌వ వేత‌నాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు సీయం కేసీఆర్ కు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఉమ్మ‌డి పాల‌న‌లో అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య పథకం కింద రూ.2,500 మాత్ర‌మే అందేవని, అర్చకులు ఇబ్బందులు పడడం గుర్తించిన సీయం కేసీఆర్….. రూ.2500 గౌర‌వ‌ వేత‌నాన్ని రూ, 6,000 పెంచార‌ని అన్నారు.

ధూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామ‌ని సీఎం కేసీఆర్ ప్రక‌టించి, ఇప్పుడు దానిని రూ 10,000 కు పెంచార‌ని పేర్కొన్నారు. వేతనం పెంపును సీఎం కేసీఆర్‌ ప్రకటించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమ‌న్నారు. గ‌తంలో 1805 ఆల‌యాల‌కు మాత్ర‌మే ధూప దీప నైవేద్య ప‌థ‌కం అమ‌లు చేస్తే ద‌శల వారీగా ఈ ప‌థ‌కాన్ని మ‌రిన్ని ఆల‌యాల‌కు వర్తింప‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 6,541 దేవాల‌యాల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ధూప దీప నైవేద్య పథకానికి సంవత్సరానికి రూ.78. 49 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు.

Related posts

ఒకే రోజు వెయ్యి మందికి ప్రయివేటు ఉద్యోగాలు

Satyam NEWS

కిమ్ పాలన గుర్తు చేస్తున్న వై ఎస్ జగన్

Satyam NEWS

ప్రజాతంత్ర, లౌకిక శక్తులను గెలిపించండి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!