31.7 C
Hyderabad
May 2, 2024 08: 19 AM
Slider నిజామాబాద్

రెండేళ్లలో అనేక ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు

Hanmanth shinde

గడిచిన రెండేళ్ల పాలనలో ఎంతో ప్రగతి సాధించామని జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే అన్నారు. ఈ సందర్బంగా పిట్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రైతుబంధు రైతుబీమా తో పాటు చెరువుల పునరుద్ధరణ, కళ్యాణలక్ష్మి, అమ్మవోడి, ఆసరా పెన్షన్లు లాంటివి ఎన్నోఉన్నాయన్నారు. త్వరలోనే జుక్కల్ నియోజకవర్గంలో మిగిలివున్న డబుల్ బెడ్రూమ్ పథకం ఒక్కటే అన్నారు. అది కూడా పూర్తి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని శనివారం జుక్కల్లో వంద ఇళ్లను ప్రారంభించామన్నారు. జుక్కల్ పిట్లం ప్రజల చిరకాల కోరిక అయినటువంటి నాగమడుగు ఎత్తిపోతల పథకాన్నిత్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నామన్నారు. ప్రారంభించిన రెండేళ్ల లోనే పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించి పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యకర్తలే పార్టీకి వారధులని మరోసారి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటి చెర్మెన్ సుధాకర్ రావు, ఎంపిపి కవిత విజయ్ పాల్గొన్నారు.

Related posts

డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఎదురుతిరిగిన రెడ్లు

Bhavani

అలెర్ట్ రిటర్న్:ముంబై- హైదరాబాద్‌ ప్లేన్ ఇంజిన్‌లో లోపం

Satyam NEWS

ఉద్యోగులకు ఐఆర్ మరింత పెంచాలి

Satyam NEWS

Leave a Comment