38.2 C
Hyderabad
May 5, 2024 20: 45 PM
Slider నిజామాబాద్

ఠాకూర్ బీడీ కంపెనీ స్థలం కబ్జా

#thakur

కామారెడ్డి జిల్లా కేంద్రం నడిబొడ్డున ఠాకూర్ సావదేకర్ బీడీ కంపెనీ స్థలంపై భూ అక్రమార్కుల కన్ను పడింది. పట్టదారుల నుంచి కంపెనీ రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన స్థలంపై ఏకంగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జాకు యత్నించడంతో పాటు మారణాయుధాలతో కంపెనీ కార్మికులపై దాడి చేసి గోడను కూల్చివేసే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై కంపెనీ మేనేజర్ కైరంకొండ సత్యనారాయణ మీడియాను ఆశ్రయించారు. 2004 లో సుతారి పోచవ్వ, సుతారి లక్ష్మి ల వద్ద సర్వే నంబర్ 41, 42 లో 1.03 ఎకరాల భూమి కొన్నామని, 2012 లో నాల కన్వర్షన్ చేశామన్నారు. అయితే 2022 లో ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి ఈ స్థలం కొన్నాడని ప్రస్తుతం ఆ భూమి కబ్జాకు పాల్పడుతున్నారన్నారు.

గీరెడ్డి శివారెడ్డి అనే వ్యక్తి, ఇమ్రాన్ ఖాన్, అజార్ ఖాన్ అనే వ్యక్తులు 10 మంది గ్యాంగ్ తో మారణయుధాలు తీసుకువచ్చి కంపెనీ కోసం చేసిన నిర్మాణ గోడలను కూల్చేసారన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సంబంధిత కబ్జాదారులు డాక్యుమెంట్లు చూయించకుండా తమపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. బీడీ యూనియన్ నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. వేల మంది కార్మికుల పొట్ట కొట్టేలా చేస్తున్నారని, అక్రమార్కుల నుంచి తమ భూమి కాపాడుకునేందుకు రేపు జిల్లా కేంద్రంలో 2 వేల మందితో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా 43 యూనియన్లు మద్దతు ఇస్తామన్నారు. మారణాయుధాలతో దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్న భూ కబ్జాదారులను అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Related posts

కిరణ్ మృతిపై విచారణ ప్రారంభించిన గుంటూరు అడిషినల్ ఎస్పీ

Satyam NEWS

పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు అరికట్టలేరా

Satyam NEWS

బ‌ల్దియా రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు వైద్య బీమా సౌక‌ర్యం

Satyam NEWS

Leave a Comment