28.2 C
Hyderabad
January 21, 2022 16: 21 PM
Slider సినిమా

బొమ్మకు క్రియేషన్స్ “ది బాస్ (నెవర్ డైస్)” టైటిల్ లోగో లాంచ్

#theboss

షూటింగ్ పూర్తి – పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశలో!!

బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై షకలక శంకర్ టైటిల్ పాత్రలో యువ నిర్మాత బొమ్మకు మురళి నిర్మిస్తున్న సంచలన చిత్రం “ది బాస్”. నెవర్ డైస్ అన్నది ఉపశీర్షిక.  వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే అనే ఊహాజనిత కథాంశం ఆధారంగా… బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత వివాదాస్పద చిత్రం ‘ది బాస్-నెవర్ డైస్” టైటిల్ లోగోను ప్రముఖ నటుడు సునీల్ విడుదల చేశారు.

ఈశ్వర్ బాబు దర్శకత్వంలో బొమ్మకు మురళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “ది బాస్-నెవర్ డైస్” సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుందని…. రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తమ చిత్రం “ది బాస్-నెవర్ డైస్” టైటిల్ లోగో ఆల్ రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ఈశ్వర్ బాబు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.

డెబోరాఫెల్, సోహైల్, రాజశ్రీ, సన, హర్షవర్ధన్, పోసాని, సూపర్ ఉమన్ లిరిష, పటాస్ ప్రవీణ్, జబర్దస్త్ మురళి, చిట్టిబాబు, పంచ్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఛాయాగ్రహణం-కూర్పు: హిమాన్షు, సంభాషణలు: బాద్షా హెచ్.కె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కనకదుర్గ, నిర్మాణం: బొమ్మకు క్రియేషన్స్, సమర్పణ: హిమమాల బొమ్మకు, కథ-నిర్మాత: బొమ్మకు మురళి, దర్శకత్వం: ఈశ్వర్ బాబు ధూళిపూడి!!  

Related posts

మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

Satyam NEWS

కుటుంబ సభ్యుల మధ్య బాలకృష్ణ జన్మదినం

Satyam NEWS

సప్తగిరి మాసపత్రికతో బాటు ‘రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు’

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!