26.2 C
Hyderabad
October 15, 2024 12: 35 PM
Slider జాతీయం

హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి

mayawathi

ఉత్తర ప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్ పి అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ లో మహిళల పట్ల అత్యాచారాలు పెరిగిపోయాయని పోలీసులంటే కూడా భయం లేని పరిస్థితి నెలకొని ఉందని ఆమె అన్నారు.

హైదరాబాద్ పోలీసులు దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన వెంటనే మాయావతి స్పందించారు. హైదరాబాద్ పోలీసులకు ఆమె పూర్తి మద్దతు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులతో బాటు, ఢిల్లీ పోలీసులు కూడా హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు.

మహిళల పై అత్యాచారాలు చేసే వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వాలు అతిధుల్లా చూస్తున్నాయని ఈ పరిస్థితి మారాలని మాయావతి ఆకాంక్షించారు. ఉత్తర ప్రదేశ్ లో ఇదే జరుగుతున్నదని ఆటవిక రాజ్యం అక్కడ నడుస్తున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ హత్య కేసులో నిందితులకు ఉరి శిక్ష వేయాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ రేఖా శర్మ అన్నారు. పోలీసులు మంచి న్యాయ నిర్ణేతలని, దిశ హత్య కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పై ఆమె వ్యాఖ్యానించారు. అక్కడ పరిస్థితులను బట్టి పోలీసులు ఆ విధంగా ప్రవర్తించి ఉంటారని రేఖా శర్మ అన్నారు.

Related posts

నాకు మంత్రి పదవి రాదు: కొడాలి నాని

Satyam NEWS

ఎన్.హెచ్.ఏ కార్డు పొందండి…బీజీపీ ఆఫీసులోనే పొందండి

Satyam NEWS

ఇమ్రాన్ ఖాన్ భావాలకు అనుగుణంగానే అమెరికా

Satyam NEWS

Leave a Comment