38.2 C
Hyderabad
April 29, 2024 22: 02 PM
Slider ఖమ్మం

రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్రo

#brs

తెలంగాణ అభివృద్ధిపై అడుగడుగున విషం చిమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం,  రైతు కల్లాలు నిర్మించేందుకు ఇచ్చిన 150 కోట్ల నిధులను తిరిగి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  ఖమ్మం నగరంలో ధర్నా చౌక్ నందు బి‌ఆర్‌ఎస్  పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రాములు నాయక్, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై అడుగడుగునా అక్కసుకాకుతూ తెలంగాణ రాష్ట్ర రైతులపై విషం చిమ్ముతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని విధానాలను ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఖండించారు. దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకునే గుజరాత్ లో సైతం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న చేయూత యావత్ దేశానికి ఆదర్శమని తెలిపారు. కేసిఆర్ నిర్ణయంతో  జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పాలక తెలియజేసే విధంగా మొదలైన ప్రస్తావనం బీజేపీ కేంద్ర పెద్దల గుండెల్లో వణుకు పుట్టిస్తుందని తెలిపారు. కేసిఆర్ స్థాపించిన జాతీయ పార్టీ బీఆర్ యస్ తో బీజేపీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని , రైతులను అడుగడుగునా ఇబ్బంది పెడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఇకనైనా కనువిప్పు కలిగాలని లేకపోతే యావత్ దేశ ప్రజలు గోరి కట్టక మానరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాలుపంచుకున్నారు.

Related posts

జనతా కర్ఫ్యూ పాటిస్తున్న మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Satyam NEWS

ఘనంగా మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి ధ్వజారోహణం

Bhavani

నిరుద్యోగులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

Sub Editor

Leave a Comment