37.2 C
Hyderabad
April 30, 2024 13: 33 PM
Slider మహబూబ్ నగర్

నిరుద్యోగులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

BC Sankshema Sangam

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేసింది.

కొత్తకోటలోని బెస్ట్ గ్రామర్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉద్యోగాల డ్రామా ఆడుతున్నారని, జోనల్ వ్యవస్థ ఆమోదం పొందకుండా ఖాళీలు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని చూయించే ప్రయత్నం చేస్తున్నారని కానీ వాస్తవానికి 2లక్షల70 వేల ఖాళీలు ఉన్నాయన్నారు.

ప్రతి శాఖలో రిటైర్డ్ అయిన ఉద్యోగులను తొలగించి రెగ్యులర్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల లెక్కేంతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు ఉద్యోగ నియామక క్యాలెండర్ ఏర్పాటు చేసి, దాని ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మీకేమో పదవులు, మాకేమో గొర్లు, బర్లా…ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు.. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఇదివరకే ఇచ్చిన నోటిఫికేషన్లో కోర్టు కేసుల పేరుతో పెండింగ్లో ఉన్న919 పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అమరుల శవాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం…ఉద్యమకారులతో పాటు అన్ని వర్గాల వారిని విస్మరించిందని, అన్ని వర్గాలను ఏకం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వ పతనమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భీమన్ననాయుడు, మండల అధ్యక్షుడు అంజన్నయాదవ్, నాయకులు రాఘవేందర్ గౌడ్, సురేష్ బాబు ఆఫ్రిద్, ఇమ్రోజ్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

సెలబ్రేషన్: పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మాగంటి

Satyam NEWS

పౌరసత్వ చట్టాన్ని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

Satyam NEWS

పేదోడి ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు…

Satyam NEWS

Leave a Comment