40.2 C
Hyderabad
April 28, 2024 16: 29 PM
Slider తూర్పుగోదావరి

జగన్ గుండెల్లో రాయి: టీడీపీ జనసేన పొత్తు ఖాయం

#pavankalyan

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసే వెళ్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో చంద్రబాబునాయుడితో భేటీ అనంతరం ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది.. చంద్రబాబును రిమాండ్ కు తరలించడం బాధాకరం అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ నేడు లోకేష్, బాలకృష్ణ తో కలిసి చంద్రబాబుతో ములాఖత్ జరిగింది. ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో బిజెపి , టీడీపీ కి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు అనుభవం ఉన్న నాయకుడు కావాలనే ఉద్దేశ్యంతోనే అని ఆయన అన్నారు.

అయితే ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం వల్లే గతంలో తాను చంద్రబాబుతో విభేదించానని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా చంద్రబాబు సమర్థత నాకు తెలుసు.. జగన్ ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి.. జగన్ దేశం విడిచిపోవాలంటే.. కోర్టు పర్మిషన్ తీసుకోవాలి.. అడుగడుగునా చట్టాలు ఉల్లంఘిస్తున్న జగన్.. రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఉందా? ఉపాధి అవకాశాలు వచ్చాయా? మద్యపాన నిషేధం జరిగిందా?  సిపిఎస్ రద్దు చేశారా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించకూడదా? ఆయన అన్నారు.

వైసిపి వ్యతిరేక ఓట్లు చీలనివ్వను..అని ముందు నుంచే చెబుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని వేళ్ళు జగన్ వైపే చూపిస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.

Related posts

స్కాలర్ షిప్ అక్రమాలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు

Satyam NEWS

సింగరేణి ఏరియా హాస్పిటల్ ముందు నర్సుల ధర్నా

Satyam NEWS

ఘనంగా ‘తెలంగాణ విమోచన’ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment