31.7 C
Hyderabad
May 7, 2024 01: 51 AM
Slider ముఖ్యంశాలు

సెప్టెంబర్ 16వరకు ఇంటర్‌ ప్రవేశాల గడువు

#Education Department

ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాల గడువు తేదీని విద్యాశాఖ పొడిగించింది. 2023-24 విద్యా సంవత్సరంలో మొదటి ఏడాది ఇంటర్‌ ప్రవేశాలకు సెప్టెంబరు 16 వరకు అవకాశం కల్పించింది. ఇంటర్‌ బోర్డు తాజా ఆదేశాల మేరకు సెప్టెంబరు 16 వరకు మొదటి ఏడాది ఇంటర్‌లో ప్రవేశాలకు విద్యార్థులను అనుమతించాలని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌, కాంపోజిట్‌ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.

అయితే ఈ నెల 16 వరకు ప్రవేశాలను రూ.1000 ఆలస్య రుసుముతో పొందొచ్చని సూచించింది. విద్యార్థులు తమ ఉన్నత చదువులను కోల్పోవద్దన్న ఉద్దేశ్యంతోనే ఇంటర్‌ ప్రవేశాల గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు ప్రకటనలో పేర్కొంది. గడువు పొడిగించిన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతి పొందిన జూనియర్‌ కళాశాల్లోనే చేర్పించాలని సూచించింది.

అఫిలియేటెడ్‌ జూనియర్‌ కాలేజీల వివరాలను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 83177, ప్రయివేటులో 311160, ఇతర కాలేజీల్లో కలిపి మొత్తంగా 4,92, 873 మంది ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరినట్లు వివరించింది.

Related posts

మధిరలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి కావాలి

Bhavani

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు 72 వ‌ పుట్టిన‌ రోజు

Satyam NEWS

తీన్మార్ మల్లన్న ను వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

Leave a Comment