40.2 C
Hyderabad
April 29, 2024 17: 39 PM
Slider ముఖ్యంశాలు

2 వేల మంది బస్‌ ఆఫీసర్ల నియామకం

#TSRTC

నష్టాల బాట నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టీఎస్‌ఆర్టీసీ మరో కొత్త కార్యాచరణకు సిద్ధమైంది. ఇప్పటికే పల్లె వెలుగు, గ్రామీణ ప్రాంత ప్రయాణికుల కోసం పలు ఆకర్షణీయ పథకాలు అమలులో ఉన్నాయి. అలాగే, నగర ప్రాంతాల్లోనూ టీ-24, టీ-9 వంటి రాయితీలతో కూడిన టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి.

నగర, గ్రామీణ ప్రాంతాలలోని కాలనీల ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల వైపు ఆకర్శించే విధంగా 2 వేల మంది కాలనీ, బస్‌ ఆఫీసర్లను నియమించాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం త్వరలోనే అమలులోకి రానుంది. బస్‌ ఆఫీసర్ల నియామకం, వారి విధులకు సంబంధించి టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేశారు.

కాగా, నగర ప్రాంతాలలో నియమితులయ్యే కాలనీ బస్‌ ఆఫీసర్లు ఆయా నగరాల్లోని వివిధ కాలనీలలో తిరిగి టీఎస్‌ ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తే కలిగే ప్రయోజనాలు, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు.

అలాగే, నగరంలో వాణిజ్య ప్రాంతాలతో పాటు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాలకు షాపింగ్‌, వినోదం వంటి కారణాలతో ప్రజలకు ఎక్కువగా వస్తుంటారు. ఎక్కువగా సిటీ బస్‌లు అందుబాటులో ఉండకపోవడం, బస్టాపులు వీటికి దూరంగా ఉండటంతో ప్రజలు క్యాబ్‌లు, ఆటోలు వంటి ప్రైవేటు రవాణా వ్యవస్థపై ధారపడుతున్నారు.

ఆర్టీసీ నియమించే కాలనీ బస్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన కాలనీలలో తరచూ పర్యటించి ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు, మహిళలు, విద్యార్థులు షాపింగ్‌, వినోదం కోసం ఎక్కడికి వెళుతున్నారు ? ఏ రవాణా సౌకర్యాలను వినియోగిస్తున్నారు ? వంటి సమాచారరం తెలుసుకుని వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయిస్తారు.

అలాగే, కాలనీలలో జరిగే వివాహాలు, ఇతర శుభకార్యాల సమాచారాన్ని సైతం సేకరించి సంబంధిత వ్యక్తులకు తమ బస్సులను బుక్‌ చేసుకోవాలని సూచిస్తారు.

ఒకవేళ ఆ ప్రాంతం నుంచి ప్రజల డిమాండ్‌ను బట్టి అదనపు బస్సులు సైతం ఏర్పాటయ్యేలా చూస్తారు. అలాగే, అయితే, ఆయా కాలనీలలో నివసించే డ్రైవర్లు, కండక్టర్లనే కాలనీ బస్‌ ఆఫీసర్లుగా నియమిస్తారనీ, ఆ అధికారం ఆ ప్రాంత బస్‌ డిపోల మేనేజర్లకే అప్పగించనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

విలేజి బస్‌ ఆఫీసర్లు సైతం ఇవే అంశాల ప్రాతిపదికన విధులు నిర్వర్తించనున్నారు. తమ ప్రాంత పరిధిలోని గ్రామ పెద్దలు, అసోసియేషన్లు, ఇతర ప్రముఖులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక బస్సులను బుక్‌ చేసిన కాలనీ, బస్‌ ఆఫీసర్లను అవార్డుల రూపంలో సన్మానించాలని సైతం టీఎస్‌ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

కాగా, టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రామాల్లో బస్సు సర్వీసులను నడిపిస్తున్నది. ఏ సీజన్‌లో ఆ సీజన్‌కు తగిన విధంగా టికెట్ల రేట్లను తగ్గించడం, ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుకుంటున్నది.

Related posts

నటి శ్రద్ధా శ్రీనాథ్ తో ఆర్ కె ఇంటెర్నేషనల్ చిత్రం “కలియుగం”

Satyam NEWS

రైల్వే గేట్ల వద్ద ఇబ్బందులు తొలగించండి

Satyam NEWS

వరదలపై సీఎం ఆరా: అధికారులూ అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment