37.2 C
Hyderabad
May 6, 2024 20: 27 PM
Slider గుంటూరు

గాజు గ్లాసు గుర్తు మాదే జనసేనకి సంబంధం లేదు

#Janasena

గాజుగ్లాసు గుర్తు తమదేనని జనసేన పార్టీకి గ్లాసుగుర్తు పై ఎటువంటి హక్కు లేదని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉందని జనసేన నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం గురించి అవగాహనా రాహిత్యంతో జనసేన పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారని తెలిపారు.తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక,బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో నవతరంపార్టీ కి గ్లాసుగుర్తు ను ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం జనసేన నేతలు మరచిపోయినట్లున్నారని అన్నారు.నూరుశాతం గ్లాసుగుర్తు నవతరంపార్టీకే ఎన్నికల కమిషన్ ఇస్తుంది అని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.

అవసరం అయితే తాము సుప్రీంకోర్టు కు వెళతామని గ్లాసుగుర్తు ను సాధించుకుంటామని అన్నారు. పొత్తులో కొన్ని స్థానాల్లో పోటీ చేసే జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ గ్లాసుగుర్తు కేటాయింపు చేయడానికి నిబంధనలు అడ్డు వస్తాయని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ,25 పార్లమెంట్ స్థానాల్లో నవతరంపార్టీ నుండి గాజుగ్లాసు గుర్తు పై అభ్యర్థులను నిలబెట్టి తీరుతామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.

గాజుగ్లాసు గుర్తు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా జనసేన పార్టీ ఉపయోగిస్తుంది అని ఈ అంశంపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించే వీలుంది అని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. ఎన్నికల కమిషన్ విధుల్లో ఎటువంటి తప్పులు లేకుండా ఉంటే జోక్యం చేసుకోవడం సుప్రీంకోర్టు కు కూడా సాధ్యం కాదని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రజలు గాజుగ్లాసు గుర్తు విషయంలో జనసేన పార్టీ నేతలు మాటలు నమ్మి అయోమయంలో పడవద్దని, గ్లాసుగుర్తు పై 2024 ఎన్నికల్లో నవతరంపార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.

Related posts

ఓ గాడ్: శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అక్రమాలు

Satyam NEWS

కూలీలకు, చేతి వృత్తిదారులకు నెలకు పది వేలు ఇవ్వాలి

Satyam NEWS

వటపత్రసాయి అలంకారంలో ఒంటిమిట్ట కోదండరాముడు

Satyam NEWS

Leave a Comment