36.2 C
Hyderabad
May 7, 2024 12: 51 PM
Slider కృష్ణ

పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జగన్ ప్రభుత్వం

#Panchayati Raj system

రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు, సర్పంచుల సమస్యలపై నేడు కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఏలూరు సిటీలోని, పాత బస్టాండ్ దగ్గర హోటల్ స్వాగత్ లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని, దానిలో భాగంగానే క్రొత్తగా గృహ సారధులని, సచివాలయ కన్వీనర్లుని నియమించి సర్పంచులను, ఎంపీటీసీలను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలు లాగా మార్చి వేస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఈ డిమాండ్లు చేసింది.

1) సర్పంచుల నిధులు, విధులు, అధికారాల సాధన కోసం మరియు కేంద్ర ప్రభుత్వం 14 ,15వ ఆర్థిక సంఘం ద్వారా 12918 గ్రామాల సర్పంచులకు పంపిన రూ.8660 కోట్లు తిరిగి సర్పంచుల PFMS ఖాతాల్లో జమ చెయ్యాలి

2) గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను సర్పంచుల అధ్వర్యంలోకి తీసుకురావాలి

3) సర్పంచులకు, ఎంపీటీసీ లకు రూ.15 వేలు, అలాగే ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ.30000 వేలు గౌరవ వేతనం ఇవ్వాలి

4) ఉపాధి హామీ నిధులు కూడా గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలి

5) పాత పద్ధతిలోనే పంచాయతీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి

6) గత మూడు న్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన గ్రామ పంచాయతీల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలి

ఈ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని సర్పంచులందరినీ కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, గౌరవ సలహాదారులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, పిల్లి

సత్యరాజు, ఉపాధ్యక్షులు వినోద్ రాజు, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్. కృష్ణా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు వసంత కుమార్, పోతుల అన్నవరం.

పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా అధ్యక్షులు కడలి గోపాల్ రావు, ప్రభాత్ . సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు కాకర శ్రీనివాస్ ,బుచ్చిరాజు ,రాజారావు , సుబ్బారావు, చెల్లిబోయిన హెలిన, కాగిత గోపాల్ రావు ,ముప్పనేని రవి ప్రసాద్, మండలి ఉదయభాస్కర్, గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వార్త దినపత్రిక జర్నలిస్టుపై పాశవికదాడి

Satyam NEWS

ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవo

Murali Krishna

వ్యాయామ ఉపాధ్యాయులు మధ్యాహ్నమే స్కూలుకు వెళ్లాలి

Satyam NEWS

Leave a Comment