37.2 C
Hyderabad
April 26, 2024 19: 53 PM
Slider శ్రీకాకుళం

వ్యాయామ ఉపాధ్యాయులు మధ్యాహ్నమే స్కూలుకు వెళ్లాలి

teachers

సమగ్ర శిక్ష ఆర్ట్ క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయులతో వెట్టిచాకిరి చేయించు కోవద్దని సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల జిల్లా అధ్యక్ష  ప్రధాన కార్యదర్శులు గంగు వెంకట రమణ మూర్తి  గుండా బాల మోహన్ అధికారులను కోరారు.

 శ్రీకాకుళం గ్రామీణ మండలం లో పాత్రునివలస గ్రామంలో నేడు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వీరు రెగ్యులర్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నా ఇతర నియమ నిబంధనలు వర్తింపచేయడం లేదని అన్నారు. అందుకోసమే ఈ ఉపాధ్యాయులు మధ్యాహ్నం మాత్రమే స్కూల్ కి వెళ్ళాలి అని పిలుపునిస్తున్నామని అన్నారు. ఒప్పంద పొరుగు సేవల ఆర్ట్ క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు మధ్యాహ్నం మాత్రమే విధులకు  హాజరుకావాలని అప్పటి రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి ఉషా రాణి ఒక మెమోను విడుదల చేశారని వారు గుర్తు చేశారు.

2013 నుంచి 2019 వరకు పని చేస్తున్న అందరికి ఇది వర్తిస్తుందని వారు వెల్లడించారు. వీరంతా పాఠశాలలో వాళ్లకు సంబంధించిన అంశాలు మాత్రమే బోధించాలని అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ పాఠశాలలో ఉండే ఇతర పాఠ్యాంశాలను బోధించ కూడదని వారు తెలిపారు.

ఇప్పటికైనా మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సహకరించాలని, అలాగే వీరందరికీ సంవత్సరానికి 15  సాధారణ సెలవులు కూడా ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.

Related posts

శ్రీను మృతికి కారకురాలైన వారిపై చర్యలు తీసుకోవాలి

Bhavani

మానసిక,శారీరక ఆరోగ్య ప్రదాయిని యోగా

Satyam NEWS

రాపిడ్ డెకాయిటీ: తమిళనాడు లోనూ కొట్టేశారు

Satyam NEWS

Leave a Comment