33.7 C
Hyderabad
April 28, 2024 00: 19 AM
Slider విజయనగరం

కొత్త గా జాయిన్ అయిన ఆ ఇన్ స్పెక్టర్ ముందు పెను సవాళ్లు…!

పోలీసు అంటే… “పోలీసు స్టోరీ” సినిమాలో హీరో సాయికుమార్ చెప్పినట్లు సత్యం, ధర్మం, న్యాయం.. ఈ మూడింటికి కట్టుబడిన వాడే పోలీసు అని అంటాడు. అయితే అది సినిమాలో హీరో వల్లించడం వరకేనని జగమెరిగిన సత్యం. నిజ జీవితం లో ఖాకీ యూనిఫామ్ వేసుకున్న ప్రతీ పోలీసు ఉద్యోగి..మొదట్లో అలానే అనుకుని…అనుకోవడం కాదు… అలా నే పని చేస్తాడు..పోలీసు మ్యాన్యువల్ లో ఉన్న చందంగా ఎన్నో రూల్స్.. కట్టుబాట్లు పాటిస్తూ నే చట్టాన్ని లోబడే పని చేయాలని… ప్రతీ పోలీసోడు…చార్జ్ తీసుకు నే టప్పుడు.. శిక్షణ లో చెప్పించేది ఇదే.కానీ.. యూనిఫామ్ వేసుకుని.. చేతిలో లాఠీ…మొలలో పిస్తోల్… నడుం కు బెల్ట్ ఉన్న ప్రతీ పోలీసు ఉద్యోగి…రంగంలో కి దిగితే… చట్టం ముసుగులో ఎన్నో పనులు చట్ట వ్యతిరేకంగా చేయాల్సి వస్తుంది.. కాదు.. కాదు చేయించేలా చేస్తారు… ప్రజాప్రతినిధులు.

అయితే ఈ సోది ఎందుకంటే… ఇటీవలే ఏపీ రాష్ట్ర డీజీపీ..ఉత్తరాంధ్ర లో పర్యటించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల్లో శాఖా పరంగా సమీక్షలు కూడా నిర్వహించడమే కాకుండా ఎక్కడికక్కడ.. స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి మరీ శాఖా పరంగా ఎస్పీ ల ఆధ్వర్యంలో సిబ్బంది చేస్తు పని గురించి.. డీజీపీ చెప్పడమే కాకుండా… మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇవ్వడానికి ఒక్క సారి పరిశీలిస్తే… శాఖా సిబ్బంది చేస్తున్న పని తనాన్ని ఓ డీజీపీ స్వయంగా ప్రశంసిస్తే…శాఖా సిబ్బంది కి అంతకన్నా ఇంకేం ఉంటుంది. స్వయంగా విజయనగరం జిల్లా ఎస్పీ

పనితనాన్ని… మెచ్చుకోవడం..పర్యవసనంగా శాఖా సిబ్బంది కి ఒ రకంగా బూస్టింగ్ ఇచ్చినట్టేనని స్వయంగా ఎస్ఐలు చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే..విజయనగరం జిల్లా ఎస్పీ గా దీపికా.. వచ్చి…ఏడాదిన్నర అవుతున్న సందర్భంగా పలు స్టేషన్ లలో కొంతమంది సబ్ ఇన్ స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఆ కోవలోకి వస్తారు…విజయనగరం ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర రావు. ఏడాది న్నర క్రితం… ఆండ్ర ,డెంకాడ పోలీసు స్టేషన్ లలో పని చేసి… .స్థానికంగా అటు శాఖతో పాటు సంబంధిత ప్రజలతో మమేకమైన భాస్కరరావు… తాజాగా బదిలీ పై విజయనగరం లి అత్యంత పురాతన….అతి రద్దీ అయిన..ముఖ్య మైన వన్ టౌన్ స్టేషన్ ఎస్ఐ గా భాధ్యతలు చేపట్టారు. ఇక్కడే పని చేస్తున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ రాజాం కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో ఎస్ఐ భాస్కరరావు బాధ్యత లు చేపట్టారు. ఈ సందర్భంగా “సత్యం న్యూస్. నెట్ “..సదరు ఎస్ఐ ని పలకరించింది. ప్రతీ నెలల ఎన్.సీ.ఆర్. బీ…డీసీఆర్.బీ ద్వారా ఇస్తున్న నేర నివేదికలను ప్రస్తావించింది. తన పరిథి లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆదేశానుసారం వన్ టౌన్ సబ్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పడం విశేషం.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

గర్భవతిగా వచ్చింది ఇప్పుడు చిన్నారితో ఇంటికి

Satyam NEWS

తెలంగాణపై వివక్ష: పార్లమెంటులో పోరాటానికి కేసీఆర్ ఆదేశం

Satyam NEWS

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల కుట్ర?

Satyam NEWS

Leave a Comment