Slider మెదక్

ఇంటి పన్ను వసూళ్లలో వేగం పెరగాలి

#tax collection

ఇంటి పన్ను వసూళ్ళలో వేగం పెంచాలని మెదక్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మునిపాలిటీలలో పన్నుల వసూళ్లు, వేకెంట్ ల్యాండ్స్ లో ఏంక్రోచ్మెంట్ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ పన్ను, గ్రంధాలయ సెస్, హరిత హారం, పట్టణ సుందరీకరణ, పార్కుల ఏర్పాటు, వైకుంఠధామాలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ల నిర్మాణాల ప్రగతి, శానిటేషన్, చెత్త సేకరణ తదితర అంశాలపై మునిసిపల్ కమిషనర్లతో సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ డిమాండ్ మేరకు పన్నుల వసూళ్లు ఆశాజనకంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తూ బిల్ కలెక్టర్ల పర్యవేక్షణలో బృందాల వారీగా క్షేత్ర స్థాయిలో పర్యటించి లక్ష్యం మేరకు అసెస్మెంట్ చేసి పన్నుల వసూళ్లు రాబట్టాలని అన్నారు. ప్రతి రోజు విధిగా మానిటరింగ్ చేస్తూ వివరాలను ఎప్పటికప్పుడు సి.డి.ఏం.ఏ. పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఎంత మేర పన్నులు చెల్లించవలసి ఉన్నది? నోటీసులు ఇచ్చారా ? వారి నుండి స్పందన ఎలా ఉన్నదో వెంటనే తనకు వివరాలు అందజేయవలసినదిగా ఆమె ఆదేశించారు.

మార్గదర్శకాల మేరకు ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వాలని, అక్రమ నిర్మాణాలు గుర్తించి తొలగించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఆక్రమించి డబ్బాలు, తదితర వాటిని నెలకొల్పిన వారి నుండి టాక్స్ వసూలు చేయడంతో పాటు వారి వివరాలను అందించాలని ఆదేశించారు.

పట్టణాలలో సానిటరీ ఇన్స్పెక్టర్లు సర్వే చేసి ఇంకా ట్రేడ్ లైసెన్స్ లు తీసుకోని వారికి అవగాహన కలిగించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేలా చూడాలని అన్నారు. లైసెన్స్ దారుల నుండి ఎంత మేర ఫీజు వచ్చే అవకాశముంది, ఎంత వచ్చినదో మున్సిపల్ కమీషనర్లు ర్యాండమ్ గా పరిశీలించాలన్నారు. గ్రంధాలయ సంస్థ వారు లైబ్రరీ సెస్ కట్టాలని నోటిస్ ఇస్తున్నారని, డిమాండ్ మేరకుసెస్ వసూలు చేసి చెల్లించవలసినదిగా సూచించారు .

మునిపాలిటీకి ఇంకా అవసరమున్న జె.సి.బి, ట్రాక్టర్, డోజర్ వంటి వాహానాల కొనుగోలుకు కౌన్సిల్ లో ప్రతిపాతదనాలు సమర్పించవలసినదిగా ప్రతిమ సింగ్ సూచించారు. మునిసిపల్ కమీషనర్లు కౌన్సిలర్ల వెంట వార్డులలో తిరిగి శానిటేషన్ పనులు పరిశీలించాలని, ఇంటింటా సేకరిస్తున్న తడి,పొడి చెత్తను డంప్ యార్డులకు తరలించాలని, జీవ వ్యర్థాలను డీగ్రేడ్ చేసేలా చూడాలని సూచించారు. ప్రతి వార్డులో తెలంగాణ క్రీడా ప్రాంగణం, పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు ప్లే గ్రౌండ్, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని అన్నారు.

పట్టణ సుందరీకరణలో భాగంగా వ్యూ పాయింట్ ఉండేలా కప్ సాసర్, లైటింగ్, వాటర్ ఫాల్స్, చెరువులు, కాలువల కట్ట వెంట పచ్చదనం, లైటింగ్ వంటి అభివృద్ధి పనులు చేపట్టేలా చక్కటి ప్రణాళికతో డి.పి.ఆర్. లు రూపొందించవలసినదిగా ఆమె మునిసిపల్ కమీషనర్లకు సూచించారు. సివిల్ ఇంజనీరింగ్ పనులను సమీక్షిస్తూ వైకుంఠ ధామాలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, సి.సి. రోడ్లు, మురుగుకాలువల నిర్మాణం, జంతు సంక్షేమ కేంద్రం నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టి సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు.

స్వచ్ఛ భారత్ మరిన్ని అవార్డులు సాధించడానికి అన్ని విధాలా కృషిచేస్తూ అట్టి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని మునిసిపల్ కమీషనర్ల సూచించారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమీషనర్లు, జానకిరామ్ సాగర్, మోహన్, యాదగిరి, వెంకట్ గోపాల్, ఆయా మునిసిపాలిటీలు ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధికారులు పనితీరు పై ఎమ్మెల్యే కోలగట్ల అసహనం..!

Satyam NEWS

బిచ్కుంద ప్రభుత్వాసుపత్రి తనిఖీ చేసిన వైద్యాధికారి

Satyam NEWS

కరోనా వైరస్ అరికట్టేందుకు బండి సంజయ్ పెద్దమనసు

Satyam NEWS

Leave a Comment