35.2 C
Hyderabad
April 27, 2024 13: 44 PM
Slider ఖమ్మం

కేసీఆర్ వి పిట్టల దొర కథలు

#Ponguleti Srinivas Reddy

వరదలతో ప్రజలు రోడ్లమీద ఉంటే, పక్క రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిట్టలదొరల కథలు చెబుతున్నాడని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇల్లందు లో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీలో చేరికల సభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పది రోజుల క్రితం

కురిసిన వర్షానికి రాష్ట్రంలోని ప్రజలు రోడ్డు మీద పడి ఉంటే కేసీఆర్ పక్క రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ లు పెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గాలికి వదిలేసాడన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, లక్ష రుణమాఫీ చేస్తానని తుపాకి రాముని మాటలు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని విమర్శించారు. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 25 ఎంపీ స్థానాలు ఓడిపోతామని తెలిసి తెలంగాణ ప్రజల మనోభావాల కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం నేడు కుటుంబ పాలనతో దివాలా తీసే స్థితికి

వచ్చిందన్నారు. రాములోరి కల్యాణానికి భద్రాచలం వచ్చిన కేసీఆర్ ఆ సీతారాముల సాక్షిగా భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానని చెప్పి దేవుని సైతం మోసం చేశాడని ఎద్దేవా చేశారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు హైదరాబాద్ ప్రగతి భవన్ నుండి బస్సు యాత్రలో మంది మార్బలాన్ని వేసుకొని వచ్చి భద్రాచలాన్ని పరిశీలించి గోదావరి నదికి ఇరువైపులా కరకట్టను ఏర్పాటు చేస్తామని చెప్పి ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు, వరదల్లో నష్టపోయిన వారికి ఆర్థికంగా నష్టపోయిన ప్రజలకు సహాయం చేస్తానని చెప్పి మోసం చేశాడని విమర్శించారు.

27 రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తుంటే పట్టించుకునే నాధుడు లేడన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వారిని పోలీసులతో అధికారులతో వేధింపుల గురిచేసి నేడు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తున్నామని చెప్పడం మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో భాగమేనన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడం సంతోషకరమైన విషయం అని ఎన్నికల వంతు వరకు ఈ తంతును నడుపుతూ తర్వాత ఆర్టీసీ కార్మికులను మోసం చేసే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తేనే రామరాజ్యం వస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీలు కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచుతామన్నారు. ఇల్లందు టికెట్ ఎవరికీ ఇచ్చిన కొత్త పాత కార్యకర్తలు అందరూ కలిసి మెలిసి ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇల్లందు నియోజకవర్గంలో 30 వేల నుండి 40 వేల వరకు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుందన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దమ్మున్న నాయకుడు శీనన్న అని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆనందదాయకమని ఆయన రాష్ట్రంలో ఎంతో జనాదరణ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తల్లి సోనియాగాంధీ కి కానుక ఇవ్వాలన్నారు.

ఇల్లందులో ఉన్న కొత్త పాత క్యాడర్ అంత కలిసి ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు కృషి చేయాలి అన్నారు. తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే పుట్టిందని పార్టీ మారే ప్రసక్తే లేదని పార్టీ కోసమే చివరి వరకు పనిచేస్తానని అన్నారు. కుటుంబ పాలనతో భూములు, ప్రాజెక్టులలో కమిషన్లతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటున్నారన్నారు.

Related posts

రాజకీయ నామ సంవత్సరం

Satyam NEWS

హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియాతో సాంకేతిక విద్యా శాఖ అవగాహన

Bhavani

అక్టోబర్ 18న వస్తున్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్

Satyam NEWS

Leave a Comment