38.2 C
Hyderabad
May 2, 2024 22: 39 PM
Slider సినిమా

విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా ‘నాతో నేను’ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌

#Shanti Kumar Thurlapati

సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఫిల్మ్‌ ఛాంబర్‌లో విడుదల చేశారు. ‘‘టైటిల్‌ బావుంది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’’ అని అన్నారు. సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘మంచి కథతో శాంతికుమార్‌ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది.

మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్‌గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. దర్శకుడు శాంతికుమార్‌ మాట్లాడుతూ‘‘ ఓ మంచి కథ రాసి మొదటి నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ నచ్చి వెంటనే అంగీకరించారు. నా తొలి ప్రయత్నానికి సాయికుమార్‌ గారు అండగా ఉన్నారు. చక్కని సలహా సూచనలు అందిస్తున్నారు. మంచి కథ రాశాను.. దానిని చక్కగా తెరపై చూపిస్తానని, ఆ దిశగా కృషి చేస్తానని చెబుతున్నాను’’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘దర్శకుడు చెప్పిన కథనచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. బిజీగా ఉండి కూడా మా ఆహ్వానం మేరకు విచ్చేసిన విజయేంద్రప్రసాద్‌ గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులకు మంచి సినిమా చూపించబోతున్నాం’’ అని అన్నారు.


నటీనటులు:సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు
సాంకేతిక నిపుణులు:కెమెరా: యూ’హ్. మురళి మోహన్ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, బ్యాక్గ్రౌండ్: ఎస్ చిన్న, ఎడిటింగ్: నందమూరి హరి, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శాంతికుమార్, కొరియోగ్రాఫర్: భాను, చంద్ర కిరణ్, ఫైట్స్: నందు, బ్యానర్:శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి, పీఆర్వో: మధు విఆర్

Related posts

మద్యం దొరక్క మతి భ్రమించి దూకేశాడు

Satyam NEWS

అక్టోబర్ 6న సినీబజార్ డిజిటల్ థియేటర్ లో “నీ వెంటే నేను”

Satyam NEWS

డ్రైనేజి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

Satyam NEWS

Leave a Comment