32.2 C
Hyderabad
May 9, 2024 14: 18 PM
Slider హైదరాబాద్

ఏ కారణం లేకుండా ఎలా అరెస్టు చేస్తారు?

#Telangana state BJP

ఏ కారణం లేకుండా… ఎలాంటి నోటీసు ఇవ్వకుండా… ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుని ఎలా అరెస్టు చేస్తారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి సుభాష్ మాట్లాడుతూ పేపర్ లీకేజీ విషయంలో బీఆర్ఎస్ బండారాన్ని బయట పెడతాడన్న భయంతోనే… బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ డైరెక్షన్లో… మంత్రుల ఒత్తిడితోనే బండి సంజయ్ ని పోలీసులు*అరెస్ట్ చేసారని ఆరోపించారు.

కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గరలోనే ఉందని టీఎస్పీఎస్సీ, టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే… బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈనెల 8న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన, పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న నేపథ్యంలోనే… ఎక్కడ బహిరంగసభ విజయవంతమై, తమకు నూకలు చెల్లుతాయోనన్న భయంతోనే… బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి బరితెగింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

బిజెపి బద్ద వ్యతిరేకి రాజ్దీప్ సర్దేశాయ్ కేసీఆర్ గురించి ఏమన్నారో… ప్రజలు అంతా గమనిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలకు తనను చైర్మన్ ను చేస్తే… దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలకు ఎలక్షన్ల ఖర్చు అంతా తానే భరిస్తానని కేసీఆర్ అన్నాడంటే… తెలంగాణ సొమ్ము ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడో ప్రజలారా ఆలోచించండని పేర్కొన్నారు. మీ అవినీతి నుంచి, అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బండి సంజయ్ ని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. తక్షణమే బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ డిమాండ్ చేశారు.

Related posts

స్పష్టమైన లక్ష్యాలు ఉన్న నాయకుడు కేటీఆర్

Satyam NEWS

అమెరికాలో 54 వేల మందికి అన్నదానం చేసిన 3 రోజ్ ట్రైబ్

Satyam NEWS

విషవాయువు లీకేజీ విచారణకు కేంద్ర కమిటీ

Satyam NEWS

Leave a Comment