29.7 C
Hyderabad
May 3, 2024 05: 22 AM
Slider ఖమ్మం

తల్లి బిడ్డ సంక్షేమమే ధ్యేయం

#puvvada

మహిళలు, మాతా, శిశు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది నేడు కళ్ళారా చూస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా్మకంగా నేటి నుండి అమలు చేస్తున్న న్యూట్రిషన్ కిట్ ను కొత్తగూడెం జిల్లా రామవరం మాతా, శిశు కేంద్రంలో గర్భిణీలకు మంత్రి పువ్వాడ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్బిణిగా ఉన్నపుడు న్యూట్రీషన్‌ కిట్, బాలింతగా ఉన్నపుడు కేసీఆర్‌ కిట్‌ ను పంపిణి చేయడం సీఎం కేసీఅర్ మరో అద్భుతమైన పథకానికి రూపకల్పన చేశారని అన్నారు. న్యూట్రిషన్ కిట్స్ గర్భిణులకు వరంగా మారనున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కిట్స్ పథకం ప్రారంభించడంతో మహిళలపై ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ది మరో మారు నిరూపితంమైందన్నరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనిమా లోపం ఉన్నట్లు చేపట్టిన పలు సర్వేల్లో వెల్లడైందని అందుకే కొత్తగూడెం జిల్లాలో తొలి విడతలో దాదాపు 16 వేల కిట్స్ ను పంపిణీ చేయడం జరుగుతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తుoదని అందుకే మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లకు రూపకల్పన చేయడం జరిగిందని గర్భిణీలు ఈ కిట్స్ ను పూర్తిస్థాయిలో స్వయంకే వాడుకోవాలని కుటుంబంలోని వారికి కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనతో పుట్టిన కేసీఆర్‌  న్యూట్రీషన్‌ కిట్‌ పథకాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇదొక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.25 లక్షల మంది గర్భిణీలు ఉన్నట్లు సమాచారం ఉండగా దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్, ఐరన్ ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం న్యూట్రీషన్‌ కిట్ల యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు.

Related posts

మహిళల భద్రతకు 20 దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలు, మినీ వ్యాన్

Satyam NEWS

కుషాయిగూడ మార్కెట్ లో కంపు వాసన తో ఇబ్బందులు

Satyam NEWS

కిల్లింగ్ మిస్టరీ: దివ్య హత్య కేసులో కొత్త మలుపు

Satyam NEWS

Leave a Comment