38.2 C
Hyderabad
May 3, 2024 19: 34 PM
Slider జాతీయం

హజ్ యాత్రీకులకు కొత్త నిబంధనలు ఇవి

#Haj pilgrims

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త హజ్ విధానాన్ని ప్రకటించింది. దీని కింద దరఖాస్తు ఫారమ్‌లు ఉచితంగా అందుబాటులో ఉంచారు. కొత్త ప్యాకేజీ ధర రూ. 50,000 వరకూ తగ్గింది. హజ్ యాత్రికుడు సాధారణంగా రూ. 3 లక్షల నుండి రూ. 3.5 లక్షల వరకు చెల్లిస్తారు. వారు ఏ రాష్ట్రానికి చెందినవారు అయినా దాదాపుగా ఇదే మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు, ఫారమ్‌ ఖరీదు రూ.300 చెల్లించాల్సి ఉంది.

ఇప్పుడు, ఫారమ్‌లు ఉచితం గా అందిస్తున్నారు. అయితే ఎంపిక చేయబడిన వారి నుండి మాత్రమే ప్రాసెసింగ్ రుసుము వసూలు చేస్తారు. మంత్రిత్వ శాఖ ఎంబార్కేషన్ పాయింట్ల సంఖ్యను 10 నుండి 25 కి పెంచింది. “రూ. 50,000 తగ్గింపు ప్రాథమికంగా విదేశీ కరెన్సీ నిబంధనల సడలింపు రూపంలో వస్తుంది. అంతకుముందు హజ్ యాత్రికుడు 2,100 సౌదీ రియాల్‌కు సమానమైన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఇది దాదాపు రూ. 44,000 వరకూ ఉంటుంది. విదేశీ మారకం కోసం హజ్ కమిటీకి ముందుగా ఇది చెల్లించాల్సి వచ్చేది. కొత్త విధానంలో ఈ వ్యవస్థ తొలగించబడింది. యాత్రికులు ఇప్పుడు తమకు అవసరమైన మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని పొందే వీలు కల్పించారు. మారిన నిబంధనలు హజ్ యాత్రీకులకు ఎంతో మేలు చేస్తుందని అని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సిఇఒ యాకూబ్ షేక్ తెలిపారు.

Related posts

ఫైర్: కేసీఆర్ కేటీఆర్ పై కోమటిరెడ్డి దారుణ వ్యాఖ్యలు

Satyam NEWS

మైనర్ పై అత్యాచారం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు

Satyam NEWS

అత్యంత వైభవంగా ముగిసిన రజకుల ఆరాధ్య దేవతా ప్రతిష్ఠా మహోత్సవం

Satyam NEWS

Leave a Comment