26.7 C
Hyderabad
May 3, 2024 09: 45 AM
Slider జాతీయం

ఢిల్లీలో రికార్డు స్థాయిలో తాజాగా కరోనా కేసులు

#Kejriwal

ఢిల్లీలో కరోనా మహమ్మారి మూడో విడత ప్రభావం ప్రారంభమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు.

నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో ఆరు వేల కరోనా పాజిటీవ్ కేసులు బయటకు వచ్చాయి. దాంతో కరోనా విజృంభణ మరింత దారుణంగా ఉండబోతున్నదని వైద్యనిపుణులు కూడా ఆందోళన చెందుతున్నారు.

రాబోయే కొద్ది రోజుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అందువల్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కోరుతున్నారు.

ఢిల్లీలో అన్ని ఆసుపత్రులలో సౌకర్యాలు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రయివేటు ఆసుపత్రులలో కూడా వెంటిలేటర్ బెడ్ లు పెంచేందుకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.

Related posts

సినిమా స్టార్ట్:విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీ షూటింగ్

Satyam NEWS

కరోనా భయం విద్యుత్, పెట్రోల్, డీజిల్ భారం

Satyam NEWS

సాఫ్ట్ వేర్ కంపెనీల్లాగా తయారవుతున్న బ్యాంకులు

Satyam NEWS

Leave a Comment