28.7 C
Hyderabad
April 26, 2024 07: 10 AM
Slider మహబూబ్ నగర్

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

#nagarkurnool collector

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ హెచ్చరించారు.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ ఉదయ్ కుమార్ హెచ్చరించారు.

జిల్లాలోని అన్ని మండలాల్లోని  గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు, రెవెన్యూ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ 08540 230201 నెంబర్లకు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాలని సూచించారు.

 పురాతన మట్టి నివాసాల్లో నివాసం ఉండే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ భవనాల్లో పునరావాసం కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు.

Related posts

అర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శికి హై కోర్టు షాక్

Satyam NEWS

నాలుగున్నరేళ్లుగా అభయహస్తం లేదు

Sub Editor 2

కాప్రా మునిసిపాలిటీలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ

Satyam NEWS

Leave a Comment