27.7 C
Hyderabad
May 14, 2024 07: 11 AM
Slider ప్రత్యేకం

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ముగ్గురి సస్పెన్షన్

కామారెడ్డి జిల్లా ఆస్పత్రి ఐసీయూలో కోమాలో ఉన్న రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. ఉదయం రాష్ట్ర వైద్య విధానం పరిషత్ కమిషనర్ డా.అజయ్ కుమార్ విచారణ జరిపిన గంటల వ్యవధిలోనే బాద్యులపై చర్యలకు ఉపక్రమించడం హాట్ టాపిక్ గా మారింది. జిల్లా ఆస్పత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ డాక్టర్ వసంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐసియు ఇంచార్జి డా. కావ్య, స్టాఫ్ నర్స్ మంజులను సస్పెండ్ చేస్తూ డిఎంఈ త్రివేణి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ డా. విజయలక్ష్మిని సైతం విచారణ పూర్తయ్యే వరకు కలెక్టర్ కు సరెండర్ చేసారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

గురురాఘవేంద్ర స్వామి ఛారిటబుల్ ట్రస్ట్ సహాయం

Satyam NEWS

లవర్స్ డే నూరిన్ కు తెలుగు అవకాశం

Satyam NEWS

శాడ్: పాపం భగవాన్ రెడ్డి ..జర్నలిస్ట్ గా

Satyam NEWS

Leave a Comment