33.7 C
Hyderabad
April 29, 2024 02: 59 AM
Slider ముఖ్యంశాలు

పేషంటును ఎలుక కరిచిన ఘటనపై విచారణ

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. గతంలో ఎలుకలు రోగులను కరిచిన ఘటనలతో అధికారులు అప్రమత్తమై ఎలుకలు వచ్చే రంద్రాలు మూసివేసి ఎలుకలు పట్టడానికి ప్యాడ్స్ ఏర్పాటు చేశారు. అయినా ఎలుకల తాకిడి తగ్గడం లేదు. తాజాగా జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి కోమాలో ఉండి ఐసియూలో చికిత్స పొందుతున్న ముజీబోద్దీన్ అనే వ్యక్తిని ఎలుకలు కరిచినట్టుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. కాళీ వేళ్ళను ఎలుకలు కరవడంతో రక్తస్రావం అయింది.

ఈ ఘటన మీడియాలో రావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నర్సింహ స్పందించారు. వెంటనే ఆస్పత్రిని సందర్శించాలని మంత్రి ఆదేశాలతో వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్ కామారెడ్డి జిల్లా ఆస్పత్రిని ఆదివారం పరిశీలించారు. ఘటన వివరాలను ఆస్పత్రి సూపరిండెంట్, ఆస్పత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రోగికి ఎలుక కరవడంతో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆస్పత్రిలో రోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి లోపలే భోజనం చేసి మిగిలిన భోజనాన్ని అక్కడే పడేయడంతో ఎలుకలు ఎక్కువగా సంచరిస్తున్నాయని గుర్తించారు.

ఎలుకలు వస్తున్న రంద్రాలు మూసివేయాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో ఎలుకలు పట్టుకోవడానికి ప్యాడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆస్పత్రిలో నిర్మాణాలు జరుగుతున్నందున ఎలుకల స్వైర విహారం ఎక్కువైందని, దానికి తోడు రోగుల బంధువులు తిని పడేసే భోజనం కోసం ఎలుకలు వస్తున్నాయన్నారు. ఎలుకలు కరిచిన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఆస్పత్రుల్లో ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఆస్పత్రిని సందర్శించిన బర్రెలక్క

జిల్లా ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కరిచాయని తెలుసుకున్న బర్రెలక్క అలియాస్ శిరీష ఆస్పత్రిని సందర్శించారు. కామారెడ్డి పట్టణంలో ఒక ఫంక్షన్ నిమిత్తం వచ్చిన ఆమె ఆస్పత్రిలో ఎలుక కరిచిన బాధితుడిని, బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆస్పత్రిలో ఎలుకలు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరిండెంట్ ను కోరారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

మళ్లీ అప్పు చేసిన ఆంధ్రప్రదేశ్

Satyam NEWS

బాబామెట్ట హజరత్ ఖాదర్ వలీ బాబా వారి ఆశ్ర‌మంలో ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి

Murali Krishna

Leave a Comment