29.2 C
Hyderabad
October 10, 2024 20: 26 PM
Slider సినిమా

లవర్స్ డే నూరిన్ కు తెలుగు అవకాశం

Noorin-Shereef

మలయాళంలో సంచలనం సృష్టించిన ఒరు ఆదార్ లవ్ చిత్రం ప్రియావారియర్ తో బాటు నూరిన్ కు మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రం లవర్స్ డే పేరుతో తెలుగులో అనువాద చిత్రంగా లవర్స్ డే పేరుతో విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మలయాళంలో నూరిన్ ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పుడు నూరిన్ కు తెలుగు చిత్రం ఆఫర్ వచ్చింది. ఆ చిత్రం పేరు ఉల్లాలా ఉల్లాలా. సీనియర్ నటుడు సత్య ప్రకాశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌త్య‌ప్ర‌కాశ్ మాట్లాడుతూ ఇది ఒక వైవిధ్య భరితమైన చిత్రం. రొమాంటిక్ ఎంటర్ టైనింగ్ త్రిల్లర్. ఈ సినిమాలో నూరిన్ పాత్ర చాలా కీలకం. ఆమె తన గ్లామర్ తోనూ పెర్ఫార్మెన్స్ తోనూ కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడం ఖాయమని అన్నారు. నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ మా బ్యానర్ లో రక్షక భటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్ డే చిత్రాల తర్వాత వస్తున్న సినిమా ఇది. ఇలాంటి కాన్సెప్టు చాలా అరుదుగా వస్తుంది అని అన్నారు. కథానాయిక నూరిన్ మాట్లాడుతూ తెలుగులో ఎన్నో అవకాశాలు వచ్చినా ఈ కథ నచ్చడం వల్లే ఓకే చెప్పాను అని అన్నది. తారాగ‌ణం: న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు. సాంకేతిక నిపుణులు: స‌మ‌ర్ప‌ణ‌: ఎ.ముత్త‌మ్మ‌, ఛాయాగ్ర‌హ‌ణం: జె.జి.కృష్ణ‌, దీప‌క్‌, సంగీతం: జాయ్‌, ఎడిటింగ్‌: ఉద్ధ‌వ్‌, నృత్య ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌, యాక్ష‌న్‌: డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, ఆర్ట్: కె.ముర‌ళీధ‌ర్‌, పాట‌లు: కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌ర‌ణ్‌, క‌థ – నిర్మాత‌: ఎ.గురురాజ్‌, స్క్రీన్‌ప్లే – మాట‌లు – ద‌ర్శ‌క‌త్వం: స‌త్య‌ప్ర‌కాష్‌

Related posts

మాఫియాల రాజ్యంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

Satyam NEWS

సికింద్రాబాద్‌లో నేటి నుంచి వస్త్రదుకాణాల బంద్

Satyam NEWS

చరిత్రను తెలిపే గ్రంధం “తెలంగాణ చరిత్ర తొవ్వల్లో”

Satyam NEWS

Leave a Comment