37.7 C
Hyderabad
May 4, 2024 12: 01 PM
Slider కర్నూలు

అనుమానస్పదంగా చిరుత పులి మృతి

కర్నూలు జిల్లా, కోసిగి మండలంలోని దుద్ది, వందగల్ గ్రామాలమధ్య ఉన్నటువంటి వరగోట్టు సమీపంలో , మంగళవారం నాడు చిరుత పులి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు జిల్లా అటవీశాఖ అధికారి శివశంకర్ రెడ్డి తెలిపారు. కింది స్థాయి సిబ్బంది అందిచిన సమాచారం మేరకు చిరుత పులి చనిపోయిన ప్రాంతానికి చేరుకొని ఎన్ పీసీ ఏ గైడ్ లెన్స్ ప్రకారం ఒక కమిటీ గావెళ్లి పోస్ట్ మార్టం చేయించడం జరిగిందని తెలిపారు.

ముందుగా నేషనల్ టైగర్స్ కంజన్స్ ఆఫ్ అథారిటీ హెడ్ ఆఫీస్ బెంగళూర్ వారికి సమాచారం ఇచ్చి వారి అనుమతి తీసుకొని తదుపరి కార్యక్రమాలు జరిపించినట్లు తెలిపారు.చిరుత పులి పై ఎటువంటి గాయాలు లేవనిపోస్టు మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడుతామన్నారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణ స్వామి బృందం పోస్ట్ మార్టం నిర్వహించి చిరుత పులి మృతదేహాన్ని అక్కడే ఖననం చేశారు.ఇందులో ఫారెస్ట్ అధికారులు స్కాడ్ రేంజర్ ఆఫీసర్ సుదర్శన్ ,సెక్షన్ ఆఫీసర్ మనిధర్, ఆదోని రేంజర్ ఆఫీసర్ రామచంద్రుడు.బీట్ ఆఫీసర్ అనురాధ ప్రొటెక్షన్ వాచర్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ఉద్యోగిని తిట్టినందుకు టీడీపీ నేత అరెస్ట్‌

Satyam NEWS

జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Satyam NEWS

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కొరడా

Satyam NEWS

Leave a Comment