29.7 C
Hyderabad
May 3, 2024 05: 53 AM
Slider ఖమ్మం

సకాలంలో  ధృవపత్రాలు అందించాలి

#cpi

పోలీసు ఉద్యోగ నియామకాల్లో పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నివాసదృవవీకరణ, నాన్ క్రిమిలేయర్ దృవపత్రాలు పొందడంలో సమస్యలు ఎదురవుతున్నాయని సమస్యలు లేకుండా అభ్యర్థులకు దృవపత్రాలు మంజూరు చేయాలని సిపిఐ ఖమ్మం నగర సమితి కార్యదర్శి షేక్ జానీమియా కోరారు.  సిపిఐ ఖమ్మం నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక ఖమ్మం అర్బన్ తహశీల్దార్ శైలజ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం షేక్ జానీమియా మాట్లాడుతూ పోలీసు ఉద్యోగ పరిక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న వారికి ఆంక్షలు లేకుండా అందించాలని కోరారు. అభ్యర్థుల ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు ఇటీవల పోలీసు నియామకబోర్డు విడుదల చేసిన విషయం తెలిసిందేనని  కానీ ప్రిలిమినరీ పరీక్ష అనంతరం వీరంతా శారీరక పరీక్షలకు హాజరవ్వాల్సి ఉందని, అందుకోసం పోలీసు నియామక బోర్డులో ప్రత్యేకంగా రెండవ పార్ట్ నకు దరఖాస్తు చేయాలన్న నిబంధన నేపధ్యంలో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు మధ్యలో గుర్తింపు లేని పాఠశాలల్లో చదువుకున్న అభ్యర్థులకు తాహసీల్ధార్ కార్రలయం నుండి నివాస ధృవీకరణ పత్రం మంజూరు చేసేటప్పుడు అభ్యర్థులు తెలిపిన విధంగా అదేవిధంగా నాన్ క్రిమిలేయర్ పత్రాలకోసం బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు నాన్ క్రిమిలేయర్ పత్రాన్ని వెబ్ సైట్ నందు పొందుపర్చాల్సి ఉంటుందన్నారు.

ఇందుకోసం అభ్యర్థులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రోజులు తరబడి తిప్పవద్దని అన్నారు. ఆఖరి తేదీ దగ్గర పడంతో అభ్యర్థులు గందరగోళానికి గురి అవుతున్నారని వెంటనే మంజూరు చేసి ఇవ్వాలని కోరారు సానుకూలంగా స్పందించిన తహసీల్ధార్ అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా సకాలంలో దృవ పత్రాలు అందిస్తామని తెలిపారని  అభ్యర్థులు అధైర్యపడవద్దని తెలియజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఐ ఖమ్మం నగర సమితి కార్యవర్గ సభ్యులు మందా వెంకటేశ్వర్లు, త్రీ టౌన్ ఏరియా కార్యదర్శి నూనె శశీధర్, నగర కార్యవర్గ సభ్యులు భుక్యా రవీందర్, నాయకులు అశోక్,లింగయ్య, రమేష్,శ్రీశైలం,పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపిలో సినీ అభిమానులకు దుర్వార్త

Satyam NEWS

క్వారంటైన్ లోకి వెళ్లిపోయిన మంత్రి హరీష్ రావు

Satyam NEWS

ఎలర్ట్: కలకలం సృష్టిస్తున్న నంద్యాల శానిటైజర్లు

Satyam NEWS

Leave a Comment