28.7 C
Hyderabad
May 5, 2024 11: 01 AM
Slider ఆధ్యాత్మికం

సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై త్రివిక్ర‌మ‌ అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

#Suryaprabha Vahanam

తిరుమల  శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురు‌‌‌వారం ఉదయం 9 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు త్రివిక్ర‌మ అలంకారంలో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్  కోన రఘుపతి ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు.

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.

ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

Related posts

క్రాలింగ్: కేసీఆర్ సారంటే దేవునితో సమానం

Satyam NEWS

జల దిగ్బంధంలో మహానంది పుణ్యక్షేత్రం

Satyam NEWS

కేసీఆర్, కేటీఆర్ లపై అసభ్య వీడియో పెట్టినవారి అరెస్టు

Satyam NEWS

Leave a Comment