28.7 C
Hyderabad
May 6, 2024 08: 29 AM
Slider చిత్తూరు

తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ నేడు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తో కలసి తిరుపతి వెస్ట్ పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో తరుచూ నమోదవుతున్న సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. సైబర్ నేరాలపై కేసులు నమోదు చేసి తక్షణమే దర్యాప్తునకు దిగాలని ఆయన అన్నారు. సైబర్ నేరాల దింపుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహిళా పోలీసులు, వలంటీర్లను సమన్వయం చేసుకునీ ఓటిపి ఫ్రాడ్స్ , బహుమతుల పేరున జరిగే ఆన్లైన్ మోసాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల్ని చైతన్యం చేసేందుకు తోడ్పడే కరపత్రాల పంపిణీ మరియు అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. ఈ పోలీసు స్టేషన్ పరిధిలో గతంలో రౌడీ కార్యకలాపాలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం కట్టడిలో ఉన్నప్పటికీ ప్రత్యేక నిఘా కొనసాగించాలి. రౌడీల ఆగడాలపై ఉక్కుపాదం మోపాలి. సివిల్ కేసుల జోలికి వెళ్లకుండా పోలీసులు దూరంగా ఉండాలి. కబ్జాల విషయంలో మాత్రం

చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. పైసా పైసా పోగు చేసుకుని కొన్న విలువైన ఆస్తులను స్వార్థశక్తులు దౌర్జన్యంగా కబ్జాలు చేస్తే ఉరుకోవద్దు అని తెలిపారు. అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల మహిళా పోలీసులు మరియు పోలీసు అధికారులతో ముఖాముఖి మాట్లాడారు. వారి పని తీరుపై ఆరా తీశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది పోలీసులు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సహాయం చేయాలని ఆయన కోరారు. హత్యలు, త్యాయత్నాలు, తదితర తీవ్ర బాడిలీ అఫెన్సెస్ జరుగక ముందే మొగ్గ దశలోనే తుంచేయాలి. గ్రామ సచివాలయాల మహిళా పోలీసులను సమన్వయం చేసుకుని ఇంటింటా సర్వే చేయించి సమాచారం సేకరించాలి. గ్రామ సచివాలయాల మహిళా పోలీసులు ఇచ్చిన నివేదికపై రిజిష్టర్ మెయింటేన్ చేయిలి. తరుచూ సమీక్షిస్తూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని తీవ్ర నేరాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నగరంలో రెసిడెన్సియల్ ఏరియా అధికంగా ఉండటం తగ్గట్టుగానే ప్రజలకు భద్రత కల్పించాలి. నైట్ బీట్లు ముమ్మరం చేయాలి. బ్లూకోల్ట్ , రక్షక్ లు బాగా తిప్పాలి. ఈశాన్య రుతు పవనాల ప్రభావం తిరుపతి, చిత్తూరు జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఎస్డీఆర్ ఎఫ్ , రోప్ పార్టీలు సిద్ధంగా ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సహాయక చర్యలు చేపట్టాలి. డిఐజి, స్పీలతో పాటు వెస్ట్ డీఎస్పీ నరసప్ప, వెస్ట్ సి.ఐ శివప్రసాద్, యస్.ఐ ఓబయ్య, రత్నమాల, సిబ్బంది మరియు మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Related posts

ఏజన్సీ లో మెగా వైద్య శిబిరం

Murali Krishna

తిరుమ‌ల‌లో మ‌ళ్లీ క‌నిపించిన చిరుత‌

Bhavani

సాధికారత అంటూనే ద‌ళితుల ప‌ట్ల వివ‌క్ష‌: ఎంపీ కోమ‌టిరెడ్డి

Satyam NEWS

Leave a Comment