సరూర్ నగర్ లింగోజిగూడలో గల రోడ్ నెం. 3లో గల ధర్మపురికాలనీ సంక్షేమ సంఘం, రెండవ రోజు గణపతి పూజా కార్యక్రమాల్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు జి.ఎస్.రాజు దంపతులచే పూజా కార్యక్రమం నిర్వహించారు. ముందు ముందు ఈ తొమ్మిది రోజులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, అన్నదానం, కోలాటం తదితర కార్యక్రమాలు నిర్వహించాలని ఆశయంతో ఉన్నామని ధర్మపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.ఎస్.రాజు వివరించారు. అనేక మంది దంపతులుతో పాటు వివేకానంద మూర్తి, మూర్తి, శేషగిరిరావు, కొరుప్రోలు హరనాథ్ తదితరులు పాల్గొన్న ఈ రెండవ రోజు కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.
previous post
next post