28.7 C
Hyderabad
May 6, 2024 08: 24 AM
Slider ప్రత్యేకం

ఆకాశంలోకి దూసుకుపోతున్న టమాటా ధరలు

#madanapalle

దేశంలో నిమ్మకాయ తర్వాత టమాటా కూడా సామాన్యుడికి అందకుండా పైపైకి పోవడం మొదలైంది. వేడి వాతావరణం కారణంగా టమోటా పంట దెబ్బతింది. దాని కారణంగా టమాటా ధర భారీగా పెరుగుతోంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో కిలో టమాటా రిటైల్ ధర రూ.90కి చేరుకోగా, ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ ధర కిలో రూ.50 నుంచి 60 వరకు నడుస్తోంది.

వచ్చే నెల నాటికి ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ ధర కిలో రూ.80 నుంచి 100 వరకు పెరగవచ్చని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటాను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్‌లలో రెండు వారాల క్రితం కిలో రూ.30 నుంచి 60కి అమ్ముడవుతుండగా, ఈ రోజుల్లో కిలో రూ.40 నుంచి 84 వరకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

ఈ రోజుల్లో దేశంలోనే అత్యంత ఖరీదైన టమోటా దక్షిణ మరియు తూర్పు భారతదేశంలోని నగరాల్లో అమ్ముడవుతోంది. కర్ణాటకలోని షిమోగాలో టమాటా కిలో రూ.84కు విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో రూ.79, ఒడిశాలోని కటక్‌లో రూ.75గా విక్రయిస్తున్నారు.

టమోటా రిటైల్ ధర ఢిల్లీలో రూ.40 నుంచి 50, భోపాల్‌లో రూ.30 నుంచి 40, లక్నోలో రూ.40 నుంచి 50. ముంబైలో కిలో రూ.60 నుంచి 70 వరకు విక్రయిస్తున్నారు. రెండు వారాల క్రితం ఢిల్లీలో రూ.20 నుంచి 30, భోపాల్‌లో రూ.20, ముంబైలో రూ.36గా ఉంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క మొదటి ముందస్తు అంచనా ప్రకారం, 2021-22 సంవత్సరంలో 203 లక్షల టన్నుల టమోటాను ఉత్పత్తి చేయవచ్చు.

గత ఏడాది కన్నా దిగుబడి తక్కువ

ఇది 2020-21 సంవత్సరంలో 211 లక్షల టన్నుల ఉత్పత్తి కంటే తక్కువ. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పుడు టమోటా దిగుబడి 200 లక్షల టన్నుల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండికి సంబంధించిన టమోటా వ్యాపారుల ప్రకారం, రాజస్థాన్, గుజరాత్ నుండి వస్తున్న టమోటా అయిపోవచ్చింది.

అయితే ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి ఇప్పుడు ప్రారంభం కానుంది. ఈసారి అధిక వేడి కారణంగా టమాట పంట ఎక్కడికక్కడ బలహీనపడింది. దక్షిణ భారతదేశంలో పంట చాలా బలహీనంగా ఉంది. అందుకే అక్కడి నుంచి టొమాటోలు రాకపోగా, ఉత్తర భారతం నుంచి టమాటాలు వస్తున్నాయి.

ఈ రోజుల్లో ఢిల్లీలోని మండికి 20 నుండి 25 ట్రక్కుల టమోటాలు వస్తున్నాయి, అయితే డిమాండ్‌ను తీర్చడానికి, కనీసం 40 ట్రక్కులు రావాలి. డిమాండ్‌ కంటే తక్కువగా రావడంతో టమాటా ధరలు పెరగడం కూడా ఓ కారణం. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో కొత్తపంట బలహీనంగా ఉందని టమాటా వ్యాపారులు చెబుతున్నారు. దీని రాక కూడా 15-20 రోజులు ఆలస్యం అవుతోంది. అందువల్ల టమాట ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

నేడు టమాటా మార్కెట్‌లో ఒక్కో క్రేట్‌ (1క్రేట్‌లో 25 కిలోలు) రూ.500 నుంచి 900 వరకు విక్రయిస్తున్నారు. రెండు వారాల్లో ఒక్కో క్రెట్‌కు రూ.200 చొప్పున పెరిగాయి. అసలే రైతులు గత కొన్నేళ్లుగా నష్టపోయినా ఈసారి టమాట తక్కువగానే సాగు చేశారు. కానీ ప్రస్తుతం ఎండ వేడిమికి తీవ్రంగా నష్టపోతున్నారు. దీని వల్ల టమాటా దిగుబడి తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో దేశంలో టమాట ధరలు పెరుగుతున్నాయి.

Related posts

తొలగించిన కే.జీ.బీ.వీ అధ్యాపకులకు మరల ఉద్యోగాలు

Satyam NEWS

లోన్ అప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

బతుకమ్మ చీరలను విసిరిన మహిళలు

Satyam NEWS

Leave a Comment