30.7 C
Hyderabad
April 29, 2024 05: 15 AM
Slider ఆదిలాబాద్

వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి దేశాన్ని రక్షించండి

#TradeUnionsNirmal

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో కార్మిక, ప్రజాసంఘాల నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి.

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ఈ ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు IFTU రాష్ట్ర కార్యదర్శి K.రాజన్న, AITUC నిర్మల్ జిల్లా అధ్యక్షులు G.S.నారాయణ, CITU జిల్లా కార్యదర్శి దాదే మియా మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నేపధ్యంలో ఉపాధి కోల్పోయిన అన్నిరంగాల కార్మికులకు, పేదలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

 క్విట్ ఇండియా ఉద్యమ దినం స్ఫూర్తి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉద్యమించాలని కేంద్ర కార్మిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా చేపట్టారు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడి దారులకు అనుకూలంగా కార్మిక చట్టాలలో మార్పులు ,కీలక రక్షణ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల అనుమతి,రైల్వే, టెలికామ్ సంస్థల ప్రైవేటీకరణ తదితర విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు  రాజన్న, G.S.నారాయణ, దాదేమియా తో పాటు D.నూతనకుమార్ వ్యయసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, తిరుపతి అధ్యక్షులు, M.బక్కన్న IFTU జిల్లా అధ్యక్షులు, నాయకులు  A.C.లక్ష్మణ్, శంకర్, Md.గఫూర్, S.గంగన్న, పొశెట్టి, బుక్య రమేష్, D.లింగన్న, T.అశోక్, ఇస్మాయిల్,పుండలీక్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బతికి ఉంటే కదా మిత్రమా మతాచారాలు పాటించేది?

Satyam NEWS

*ట్విట్టర్లో కేటీర్ హవా

Bhavani

హీరోయిన్ సునైన ఫొటో గ్యాలరీ

Satyam NEWS

Leave a Comment