38.2 C
Hyderabad
April 29, 2024 21: 53 PM
Slider ప్రత్యేకం

రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి: విజయనగరం ఎస్పీ దీపిక

#depikaips

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక, డీపీఓ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ మహిళలు ఇచ్చిన ఫిర్యాదులలో ఫిర్యాదు అంశాలను పరిశీలించి, సంబంధిత చట్టాలు, సెక్షన్లు ప్రకారం కేసులు నమోదు చేసి, విచారణ జరపాలన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాలకు కారణాలను, ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. రహదారిపైగల గుంతలను పూడ్చడం, మలుపులు వద్ద కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయడం, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకుండా ఉన్న పొదలను, చెట్లును తొలగించాలని, రేడియం స్టిక్కర్లు, రంబుల్ స్ట్రైప్స్, క్యాట్ ఐ లను ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తనకు పంపాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

రహదారి గ్రామాలలో అవగాహన పెంచాలి

జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో పెండింగులో ఉన్న డి.ఎన్.ఎ. మరియు ఆర్.ఎఫ్.ఎస్.ఎల్. నివేదికలను పరీక్షల అనంతరం త్వరితగతిన రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని, అందుకు ఎస్ఐ స్థాయి అధికారిని ప్రత్యేకంగా సంబంధిత కార్యాలయాలకు పంపాలని ఆదేశించారు.

న్యాయ స్ధానాలు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్లను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దిశ యాప్ ఆవశ్యకతను క్షేత్ర స్థాయిలో మహిళలు, విద్యార్థినులకు వివరించి, వారి స్మార్ట్ ఫోనుల్లో యాప్ను డౌన్లోడు చేయించి, రిజిస్ట్రేషను చేయించే విధంగా మహిళా పోలీసులు, మహిళా రక్షక్ సిబ్బంది సేవలను వినియోగించు కోవాలన్నారు.

ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోగల నాటుసారా తయారీ, అమ్మకాలు చేస్తున్న గ్రామాలను గుర్తించి, సారా నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ఎస్.ఈ.బి. పోలీసుల సహాయంతో సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

నాటుసారా అమ్మకాలు, తయారీ చేస్తున్న వ్యక్తులు తరుచూ ఇదే తరహా నేరాలకు పాల్పడితే, వారిపై 107 సిఆర్పిసి కేసులను నమోదు చేసి, బైండోవరు చేయాలన్నారు. దొంగతనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, రాత్రి బీట్లుతో గస్తీని ముమ్మరం చేయాలని, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులను రాత్రి సమయాల్లో తనిఖీ చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

దర్యాప్తులో ఉన్న తీవ్రమైన కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, కోర్టుల్లో అభియోగ పత్రాలను దాఖలు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక దిశా నిర్ధేశం చేసారు.

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

దర్యాప్తులో ఉన్న కేసులను తగ్గించడంలోను, చోరీ కేసులను చేధించడంలోను, జూదం ఆడుతున్న వారిపైన, ఎన్ఫోర్సుమెంటు కేసులను ఎక్కువగా నమోదు చేసి, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన (1) సిసిఎన్ సిఐ ఎస్.కాంతారావ (2) ఎస్.కోట ఎస్ఐ జె.తారకేశ్వరరావు (3) తెర్లాం ఎస్ఐ బి. సురేంద్ర నాయుడు (4) పెద మానాపురం ఎస్ఐ బి.భాగ్యం (5) డిసిఆర్ బి ఎస్ఐ బి. మురళి లను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఎస్ఈబి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీ రావు, విజయనగరం సబ్ డివిజన్ అదనపు ఎస్పీ అనిల్ వులిపాటి, బొబ్బిలి డీఎస్పీ బి. మోహనరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దిశ మహిళా పిఎస్ డీఎస్పీ టి.త్రినాధ్, ఎఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, లీగల్ ఎడ్వయిజర్ వై. పరశురాం, సీఐలు బి. వెంకటరావు, జి. రాంబాబు, రుద్రశేఖర్, జె.మురళి, సి. హెచ్.లక్ష్మణరావు, టి.ఎస్.మంగవేణి, సి.హెచ్. శ్రీనివాసరావు, కాంతారావు, విజయనాధ్, బాల సూర్యారావు, డి.రమేష్, జి. సంజీవరావు, ఎం.నాగేశ్వరరావు, పి. శోభన్ బాబు, పి.శ్రీనివాసరావు, డి. నవీన్ కుమార్, నర్సింహమూర్తి, మల్లా శేషు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

చిన్న పిల్లలు మోటారు వాహనాలు నడిపితే కఠిన చర్యలు

Satyam NEWS

Cricket Calendar:కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి…

Satyam NEWS

భారతీయులంతా తప్పకచూడాల్సిన సినిమా దీన్ రాజ్ “భారతీయన్స్”

Satyam NEWS

Leave a Comment