29.7 C
Hyderabad
May 3, 2024 05: 37 AM
Slider ముఖ్యంశాలు

ఎల్లో మీడియా ద్వారా బాబు జగన్ పాలనను అప్రతిష్ట చేస్తున్నారు

#mlakolagatla

ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆగితే దానికి చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాలని, దీనిని ప్రజలు గమనించాలని  ఏపీలో ని విజయనగరం ఎమ్మెల్యే,ఇటీవల డిప్యూటీ స్పీకర్ పదవిని పొందిన కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీఎం జగన్ చేస్తున్న ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు తన ఎల్లో మీడియా ద్వారా పరిపాలనను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజాభిమానం పొందలేక, ప్రజలకు దూరమైన చంద్రబాబు వైఖరిని తాము ఖండిస్తున్నామన్నారు. ప్రజలకు ఉచితంగా డబ్బుల పంపిణీ  ఆపాలని రిటైర్డ్  ఐఏఎస్ అధికారులతో చంద్రబాబు  భాష్యాలు చెప్పి స్తున్నారని, చంద్రబాబు జేబులో ఉన్న వీరు మేధావులుగా, పరిపాలన అనుభవం గల వీరు , వీరికున్న పరిజ్ఞానం ఏమిటి అని అన్నారు.

ఉన్నత అధికారులకు ఉచిత లు తెలియవా అని ప్రశ్నించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కిలో రెండు రూపాయల బియ్యం, దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఉచితాలు జరగలేదా అని ప్రశ్నించారు. ఇవి  తర తరంగా వస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఉచితంగా పసుపు కుంకుమ చంద్రబాబు ఇవ్వలేదా అని అన్నారు.

ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంటూ జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలిసిందేనని అన్నారు. చంద్రబాబు చేతకాని పరిపాలనను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్సార్, చంద్రబాబుల పరిపాలనను నక్కకు, నాగలోకానికి ఉన్న తేడాను ప్రజలు బేరీజు వేస్తున్నారు అని అన్నారు.

చేసిన అప్పులన్నీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా అప్పులు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో తెచ్చిన అప్పులకు లెక్కలు చెప్పాలని అన్నారు. జన్మభూమి కమిటీ ల పేరుతో దోచుకుని దాచుకున్నారు అని అన్నారు. చంద్రబాబు కుయుక్తులు, తప్పుడు రాజకీయాలు చెల్లుబాటు కావని  అన్నారు. పత్రికలను అడ్డుపెట్టుకుని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కల్పించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని అన్నారు.

Related posts

పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలి

Satyam NEWS

వి ఎస్ యు లో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam NEWS

చికెన్ వండ‌లేద‌ని భార్య‌ను హ‌త‌మార్చిన భ‌ర్త‌

Bhavani

Leave a Comment