26.7 C
Hyderabad
May 3, 2024 07: 17 AM
Slider మహబూబ్ నగర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు సమన్వయంతో పనిచేయాలి

#WanapartySP

రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు  పోలీసు అధికారులకు సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై వనపర్తి జిల్లా పోలీసు అధికారులకు జిల్లా కార్యాలయం నుండి  రోడ్డు సేఫ్టీ  దృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముందుగా వనపర్తి  జిల్లా పరిధిలో ప్రతి పోలీస్టేషన్ లోఈ సంవత్సరం ఎన్ని ప్రమాదాలు జరిగాయో పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ ప్రధానంగా నగర శివారు ప్రాంతంలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకుగాను మరిన్ని స్పీడ్ గన్లను ఏర్పాటు చేయాల్సి వుంటుందని అన్నారు.

వనపర్తి జిల్లా పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించడం జరిగిందని తెలిపారు.

ఈ దృశ్య సమీక్ష సమావేశం లో ఎస్పీ  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాదికన్న పది శాతాన్ని తగ్గించాలన్న సుప్రీంకోర్టు సూచనలకు తగ్గట్లుగానే గత ఏడాదికన్న ప్రస్తుతం సంవత్సరం చాల రోడ్డు ప్రమాదాలను నివారించామన్నారు.

సంబంధిత ప్రభుత్వ అధికారులు పోలీసులతో కల్సి సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా మరిన్ని రోడ్డు ప్రమాదాలను నివారించగలమని తెలియజేశారు.

తరచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో స్టాపర్స్  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించండి వాహనాలు నడిపి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.

రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇరుపక్కల చూసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు మరికొన్ని స్టాపర్స్ త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డుపై పెయింటింగ్,  స్టడ్స్, అజార్ మార్కర్స్,  బ్లింక్ర్స్ , సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనం నడిపే వారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ దృశ్య సమీక్ష సమావేశంలో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకిర్ హుస్సేన్, డిసిఆర్బీ సీఐ జమ్ములప్ప, ఐటీ కోరు సిబ్బంది గోవింద్, రవీంద్రబాబు  ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

చౌటుప్పల్ రోడ్డు ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

Satyam NEWS

కరోనా లెసన్స్: ప్రభుత్వ వైద్యో నారాయణో హరి:

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన బాహుబలి ప్రభాస్

Satyam NEWS

Leave a Comment