25.2 C
Hyderabad
October 15, 2024 11: 29 AM
Slider ఆదిలాబాద్

124 గిరిజన జంటలకు సామూహిక వివాహం

tribal marriage

కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం లోని సోమిని గ్రామ సమీపంలోని ప్రాణహిత నది ఒడ్డున సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈరోజు 124 గిరిజన సామూహిక వివాహాలు జరిపించడం జరిగింది. వధూవరులకు మేళతాళాలతో సంప్రదాయబద్ధంగా వివాహాలు జరిపించడమే కాకుండా వారికి కావలసిన అన్ని వస్తువులను కూడా సమకూర్చారు.

మట్టెలు మంగళసూత్రం వధూవరులకు పెళ్లి బట్టలు ఫ్యాన్ బీరువా వంట సామాగ్రి అన్నీ ఇచ్చి వైభవంగా పెళ్లి జరిపించారు. ముందు 116 జంటలకు పెళ్లి చేయడానికి నిశ్చయించినప్పటికీ అనుకున్నదానికంటే ఎక్కువగా పెళ్లి జంటలు నమోదు కావడం జరిగింది.

మొత్తం 124 జంటలకు వివాహం జరిపించి అందరికీ పెళ్లి పెద్దగా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ వివాహాలకు వచ్చే వారి కోసం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, తెరాస నాయకులు కట్ట ప్రసాద్ ఒకరోజు ముందు నుంచే వివాహాలు జరిగే స్థలంలో ఉండి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులను జరిపించారు. ఎలాంటి లోటుపాట్లు రాకుండా వంటలను, పెళ్లి మండపం అలంకరణ పనులను వారితో పాటు  జెడ్పిటిసి పంద్రం పుష్పలత దగ్గరుండి చూసుకున్నారు.

మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు కూడా వారికి వివిధ రకాల సహాయ సహకారాలు అందించారు. వధూవరుల బంధువులు వాహనాలను ఉంచడానికి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. పెళ్లి అనంతరం పెళ్లికి వచ్చిన అతిథులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ గిరిజన సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు. ప్రాంగణం మొత్తం బంధువులతో కిక్కిరిసిపోయింది. ఈ వివాహాలు ప్రశాంతంగా జరగడానికి  పోలీసు శాఖ వారు బందోబస్తును ఏర్పాటు చేశారు. నూతన వధూవరులు పెళ్లి జరిపించిన ఎమ్మెల్యేకి తాము రుణపడి ఉంటామని తమ లాంటి పేదవారికి అన్నీ తానై పెళ్ళి జరిపించి ఎల్లవేళలా తమకు కష్టసుఖాల్లో పాలుపంచుకున్న ఎమ్మెల్యే దొరకడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.

ఈ వివాహాలు గత మూడు సంవత్సరాలుగా జరిపిస్తున్న ఎమ్మెల్యేని  గిరిజనులు అందరూ తమ బాంధవుడిగా భావిస్తున్నారు. ఈ పెళ్లికి ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గోడం నగేష్, జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి, వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, ఎఫ్ డి ఓ విజయ్ కుమార్, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ, మండల తెరాస నాయకులు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు పెద్ద ఎత్తున పెళ్లి బంధువులు హాజరయ్యారు.

Related posts

అప్పుడు అడుగులకు మడుగులు… ఇప్పుడు మొహం చాటు

Satyam NEWS

క‌ళ్యాణ‌ల‌క్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

Sub Editor

తెలంగాణలో అమలులోకి తెచ్చిన ఎయిరో ప్రాజెక్టులెన్ని?

Satyam NEWS

Leave a Comment