37.2 C
Hyderabad
May 2, 2024 11: 15 AM
Slider ఆదిలాబాద్

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టండి

#NirmalCollector

నిర్మల్ జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  వానాకాలం 2020-21పంట కాలానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్ల పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఈ పంట కాలంలో ఒక లక్ష 56వేల 232 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని తెలిపారు.

ధాన్యం సేకరణ సంబంధించిన రవాణా, గోనె సంచులు, మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలనీ సూచించారు. కొనుగోళ్లలో గత సంవత్సరం జరిగిన లోటుపాట్లు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాంరెడ్డి, జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, జిల్లా అటవీ శాఖ అధికారి డా. సుతాన్, డిఆర్డిఓ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్,

మార్కెటింగ్ ఎడి శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా సహకార శాఖ అధికారి మురళీధర్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన డాక్టర్ లక్ష్మణ్

Satyam NEWS

ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచారు?

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధం

Satyam NEWS

Leave a Comment