నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్మల్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు సంభందించిన కోర్ట్ డ్యూటీ అధికారులకు కోర్ట్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంపై జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భముగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్ కు సంబంధించిన దర్యాప్తు సి.సి.డి.లను చేతి రాతకు ముగింపు పలకలని, దానికి బదులుగా ప్రతి సి.సి.డి.ని ఆన్ లైన్ లో నమోదు చేసి వెంటనే ప్రింట్ తీసుకొని సంబంధిత ఫైల్ ద్వారా కోర్టు నందు ప్రవేశ పెట్టాలని చెప్పారు.
ఇన్వెస్టిగేషన్ లో భాగంగా యఫ్.ఐ.ఆర్. నుండి చార్జ్ షీట్ వరకు దరఖాస్తుదారుల, నేరస్తుల, అన్ని రకాల సాక్షులకు సంబంధించిన పూర్తి వివరాల నాణ్యమైన డేటాను సి.సి.టి.యన్.యస్. అప్లికేషన్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఎస్పీ తెలిపినారు. ఈ కార్యక్రమములో అదనపు ఎస్పీ యన్. శ్రీనివాస్ రావు, డి.సి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్, ఐ.టి. కోర్ టీం ఇంచార్జ్ యస్.కె. మురాద్ అలి మరియు అన్ని పోలీస్ స్టేషన్ ల కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.