28.7 C
Hyderabad
April 28, 2024 03: 18 AM
Slider నిజామాబాద్

క్లీన్లీ నెస్: పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్య రహస్యం

falicitation

ప్రతి ఒక్కరూ ఇంటిలో ఇంటి పరిసరాలలో చుట్టు పక్కల శుభ్రత పాటించాలని వాజిద్ నగర్ గ్రామ సర్పంచ్ అనుయ లక్ష్మీనారాయణ అన్నారు. బిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్  గ్రామంలో కరోనా వైరస్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ వెంటనే ఆసుపత్రులలో  పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ మన ప్రాంతంలో ఉండదని ఆమె స్పష్టం చేశారు. కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనన్నారు. చిన్నపిల్లల పట్ల వృద్ధుల  పట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిదని ఆమె అన్నారు.

అనంతరం గ్రామంలో ప్రత్యేక సేవలందిస్తున్న మహిళా సిబ్బందికి సన్మానాలు చేశారు. వీరిలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, అంగన్వాడి టీచర్లు అనిత, నర్సవ్వ, ఆశా కార్యకర్తలు సవితా, పార్వతి, మహిళ సమాఖ్య అధ్యక్షురాలు సాయవ్వ, ఎల్లవ్వ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించి వారి పట్ల ప్రత్యేక చొరవ చూపి వారికి సమాజంలో గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేస్తున్న శోభారాణిలకు  గ్రామస్తులంతా కలిసి  సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఎంపిటిసి సాయిలు, ఉపసర్పంచ్ బద్రి సాయిలు, గ్రామ పెద్దలు గోపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ అంజయ్య, పంచాయతీ వార్డు సభ్యులు కుమ్మరి వెంకటి, చంద్రకళ, సుమలత, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, గ్రామ రెవెన్యూ అధికారిణి రాజేశ్వరి గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

అక్రమ ఇసుక, సారా సరఫరా పాఠాలు చెబుతున్న టీచర్

Satyam NEWS

హిందుత్వం పైనే అన్ని మతాల దాడులు

Satyam NEWS

బ్లాక్ ఫంగస్ భయంతో ఒక మహిళ ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment