26.7 C
Hyderabad
May 3, 2024 07: 51 AM
Slider నిజామాబాద్

పెర్కెట్ మహిళా ప్రాంగణంలో ఎస్సి మహిళా అభ్యర్థులకు శిక్షణ

SC women

ఉమ్మడి నిజామాబాదు జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని పెర్కెట్ మహిళా ప్రాంగణం ఆధ్వర్యంలో ఎస్సి మహిళా అభ్యర్థినిలకు స్వయం ఉపాధి కల్పించేందుకు టైలరింగ్, కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్త పై శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంగణం మేనేజర్ జ్యోతి అన్నారు.

గురువారం బిచ్కుంద, మద్నూర్, పెద్ద కొడపగల్ మండల కేంద్రాల్లో జరిగిన అంగన్వాడీ సెక్టర్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం లోని నిరుద్యోగ మహిళా అభ్యర్థినిలకు శిక్షణ ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన మహిళా అభ్యర్ధినీలు వారి పూర్తి వివరాలు తీసుకొని పెర్కెట్ ప్రాంగణం లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

దరఖాస్తు తో అర్హత ధ్రువ పత్రం, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువ పత్రం, తండ్రి ఆధార్ ధ్రువ పత్రం జెరాక్స్ కాపీలను తీసుకొని ప్రాంగణం కు వచ్చి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని శిక్షణ పొందేందుకు 19 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల వయస్సు కల్గి ఉన్న మహిళా అభ్యర్ధినీలు అర్హులని తెలిపారు.

ఏవైనా సందేహాలు ఉన్న 7660022520నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. కార్యక్రమం లో అంగన్వాడీ సూపర్ వైజర్ కొంరవ్వ, ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షురాలు చంప బాయి, ప్రధాన కార్యదర్శి ఆర్, అనసూయ అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

Related posts

జాగ్రతలు తీసుకోండి సైబర్ నేరస్తుల బారిన పడకండి

Satyam NEWS

చినుకు చిరుస్పర్శ

Satyam NEWS

ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంజాయ్ చేసే సినిమా ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’

Satyam NEWS

Leave a Comment