33.7 C
Hyderabad
April 28, 2024 23: 24 PM
Slider శ్రీకాకుళం

బదిలీ సమస్యలు తీర్చాలి: రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ

#Transfer issues

బదిలీల్లో భాషోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రతినిధులు DEO జి.పగడాలమ్మకు వినతిపత్రాన్ని అందించారు. D.E.O పూల్ లో ఉంటూ వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న తెలుగు, హిందీ, ఒడియా భాషా పండితుల బదిలీలలో సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. 2019లో జరిగిన ఉన్నతీకరణ పదోన్నతులు తర్వాత వివిధ పాఠశాలల్లో సర్దుబాటుకు గురైన భాషా పండితులకు వారి సర్వీసు నష్టపోయిన కాలం నుంచీ పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వీరికి మూడుసార్లు బదిలీ చేసి స్థానాలు ఇచ్చారని, ఇప్పుడు తాజా గా వెలువడిన ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలలో మరల దరఖాస్తు చేసుకోమని చెపుతున్నందున పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వాలని కోరారు.

బదిలీ అన్న అంశం వచ్చినప్పడంతా డీఈవో పూల్ వారిని బదిలీ చేయడం ఎంత వరకు సమంజసమొ అర్ధం కావడంలేదు. ఏళ్లలో 2012 DSC, 2014 DSC, వాళ్ళు ఉన్నారు. 2018 Dsc వాళ్ళు, 2002 Dsc వా వీళ్లని ఇప్పటికే మూడు సార్లు రెండు సంవత్సరాలలో స్థానాలు మార్చడం జరిగింది. వీరిని బదిలీకి దరఖాస్తు చేసుకోమంటే ఏస్టేషన్ నుండి చేసుకోవాలి ఆయా స్థానాలు తాలుకా పాయింట్స్ ఎలా వస్తాయి…. ఈ అంశాల వల్ల వీరు చాలా అన్యాయానికి గురవుతున్నారని వారు కోరారు. 2021 అక్టోబర్లో జరిగిన పదోన్నతులు పొందిన స్థానాలను వారికే కేటాయిస్తూ బదిలీల నుండి వారిని మినహాయించాలని కోరారు. 2019 1 జూలైలో జాయిన్ అయిన 39 మంది హిందీ పండితులకు ఇంతవరకు ట్రెజరీ ఐ.డి లు ఇవ్వలేదు. జీతాలు ఎలాగు లేవు.

వారు ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాష ఉపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షులు పిసిని వసంతరావు, ప్రధాన కార్యదర్శి కోన రంగనాయకులు, సహాయ అధ్యక్షులు కుప్పన్నగారి శ్రీనివాసరావు, కార్యదర్శి గండ్రెటి వినయ్ కుమార్ కిరణ్ దీనబంధు జగన్నాధ రావు తారకేశ్వరరావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

“లవ్ స్టోరి”  ‘సారంగధరియా’ పాట విడుదల చేయనున్న సమంత

Satyam NEWS

10 గ్రేడింగ్ పాయింట్స్ సాధిస్తే రూ.10,000 బహుమతి

Satyam NEWS

చనిపోయిన తల్లి బిడ్డ ఏడుపు తో బ్రతికింది

Satyam NEWS

Leave a Comment