39.2 C
Hyderabad
April 28, 2024 14: 02 PM
Slider మహబూబ్ నగర్

10 గ్రేడింగ్ పాయింట్స్ సాధిస్తే రూ.10,000 బహుమతి

#cashprize

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10 వ తరగతి విద్యార్థులు తమ భవిష్యత్తులో  “సరికొత్త బంగారు లోకం” సృష్టించుకోవడానికి 10వ తరగతి పరీక్షలే పునాది. తమ కలలను సాకారం చేసుకోవడానికి, ప్రస్తుత తమ కుటుంబం ,  “ఉన్న స్థితి”  నుంచి  “మహోన్నత” స్థితికి ఎదగాలంటే పదవ తరగతిలో 10 గ్రేడింగ్ పాయింట్స్ సాధించడం ఎంతో అవసరమని బదిలీపై వెళ్లిన అజ్జకొల్లు హైస్కూల్ మాజీ హెడ్మాస్టర్  అతీక్  అహమద్ ప్రత్యేకంగా విద్యార్థులకు హిత బోధ చేశారు. తాను గతంలో పనిచేసిన వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్, అజ్జకొల్లు పాఠశాలలో చదువుతున్న 25 మంది  పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించి, పరీక్షలు సక్రమంగా- మంచిగా వ్రాయాలని ప్రేరణ కలిగించి , వారికి పరీక్షలు రాయడానికి అవసరమైన  “25 పరీక్షా ప్యాడ్ల ” ను తానే స్వయంగా  విద్యార్థులకు పంపిణీ చేసి, ఔదార్యం చాటుకున్నారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడానికి, ఆతీక్ అహ్మద్  పదవ తరగతిలో  “10 గ్రేడింగ్ పాయింట్స్”  సాధించే అజ్జకొల్లు హైస్కూల్ విద్యార్థులకు  10,000/- రూపాయల” నగదు  బహుమతిని ప్రధానం చేస్తానని మాటిచ్చారు. అంతేగాక తాను ప్రస్తుతం పని చేస్తున్న రంగా రెడ్డి జిల్లా, పాలమాకుల హై స్కూల్ లో, 10వ తరగతి పరీక్షలలో10 గ్రేడింగ్ పాయింట్స్ సాధించే విద్యార్థులకు కూడా 10,000/- నగదు బహుమతి ఇస్తానని హెడ్మాస్టర్ ప్రకటించారు. అందువల్ల, అజ్జకొల్లు & పాలమాకుల హైస్కూల్ విద్యార్థులు,అందరూ మంచి గ్రేడింగ్ పాయింట్స్ సాధించడం కోసం ఇష్టంతో కష్ట పడి అహర్నిశలు శ్రమించి, లక్ష్య సాధన కోసం , తగిన ప్రిపరేషన్ చేసుకోవాలని హెడ్ మాస్టర్ అతీఖ్ అహ్మద్  కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సిఎంపై అనుచిత పోస్టింగులు చేసిన అధికారి అరెస్టు

Satyam NEWS

టిడిపి నేతలపై అక్రమ కేసులను ఖండిస్తున్నాం

Satyam NEWS

బీజేపీకి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ

Sub Editor

Leave a Comment