26.7 C
Hyderabad
May 3, 2024 07: 20 AM
Slider నల్గొండ

పిడుగుపాటుకు కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్

#Flames at Transfarmer

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండల కేంద్రంలోని 220 కేవీ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. నార్కట్ పల్లి మండల కేంద్రంలోని 220 కేవీ సబ్ స్టేషన్ లో పిడిగుపాటుతో మంటలు చెలరేగి  భారీ ట్రాన్స్ఫార్మర్లు పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించిందని నిర్దారణ అయినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.

సుమారు 50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ ప్రభావం నార్కట్ పల్లి, నక్కలపల్లి,ఈదులూరు, నెమ్మని సబ్ స్టేషన్ లపై మండలాలపై ఉంటుందని తెలిపారు. ట్రాన్స్ కో ఎస్ ఈ, జెన్ కో ఎస్ ఈ లతో మాట్లాడి నార్కట్ పల్లి మండలంలో  సింగిల్ పేస్ కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరతగతిన ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతస్థాయి అధికారులతో ఫోన్ లో మాట్లాడి వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడానికి వారం రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించినట్లు తెలిపారు.

Related posts

మృత్యుంజయ స్వామికి సిఎల్పీ నేత భట్టి దంపతుల ప్రత్యేక పూజలు

Satyam NEWS

ట్రాక్టర్ తో పొలం దున్నిన రాహుల్ గాంధీ

Bhavani

రివెంజ్ సక్సెస్:ఇరాన్ దాడిలో గాయపడ్డది నిజమే

Satyam NEWS

Leave a Comment