21.7 C
Hyderabad
December 2, 2023 03: 44 AM
Slider ఖమ్మం

కేసిఆర్ సారధ్యంలో పారదర్శక పాలన

#Harish rao

ముఖ్యమంత్రి కేసిఆర్ సారధ్యంలో తెలంగాణలో పారదర్శక పాలన సాగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీషారావు తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న సీట్లలో 43 శాతం తెలంగాణలోనే ఉన్నాయని మంత్రి తెలిపారు. ఖమ్మంలో మమత వైద్య సంస్థల రజతోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మమతలో నూతనంగా నిర్మించిన సిల్వర్ జూబ్లీ బ్లాక్ను ప్రారంభించారు.

మమత సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు పువ్వాడ నాగేశ్వరరావు 85వ జన్మదినోత్సవ కార్యక్రమాలు, మమత సంస్థల రజతోత్సవ కార్యక్రమాలను మమత ఆసుపత్రి ప్రాంగణంలో సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆహుతులను మమత సంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ వేదికపైకి ఆహ్వానించగా మమత సంస్థల అధ్యక్షులు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సభకు అధ్యక్షత వహించారు. పువ్వాడ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ 25 ఏళ్లుగా రాష్ట్రంలో దిన దినాభివృద్ధి చెందుతున్న మమత వైద్య సంస్థలు వేలాది మంది ప్రాణాలను కాపాడాయన్నారు. అనేక మంది వైద్యులుగా తీర్చిదిద్దిన ఘనత మనుత సంస్థలకు దక్కుతుందన్నారు.

నిరంతర పట్టుదల, మమత సంస్థలను ఈ స్థాయికి చేర్చిందని అప్పట్లో ప్రైవేటు యాజమాన్యంలో వైద్య కళాశాలలను స్థాపించడమంటే చాలా ఇబ్బందులు ఉండేవని తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు కళాశాలల విషయంలో చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాజకీయ వేత్తగా పువ్వాడ నాగేశ్వరరావుకు రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. 85 ఏళ్ల వయస్సులోనూ ఖమ్మం జిల్లా అభివృద్ధి పేదలు, గిరిజనుల అభ్యున్నతి గురించి ఆలోచన చేస్తున్నారంటే వారి పోరాట పటిమ అవగతమవుతుందన్నారు.

అటువంటి వ్యక్తి నేతృత్వంలో మమత సంస్థలు కీర్తి ప్రతిష్టలు పొందడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్య విద్యకు హబ్ గా మారుతుందని 10 వేల ఎంబిబిఎస్ సీట్లతో విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించామన్నారు. ఒకప్పుడు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే వారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఓపెన్ కేటగిరిలో తెలంగాణకు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారని దేశంలో 43 శాతం సీట్లు తెలంగాణలోనే కల్పించడం జరిగిందని మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కలిపి కేవలం 57 శాతం మాత్రమే వైద్య విద్యకు అవకాశం కల్పిస్తున్నాయని హరీష్ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ పారదర్శక విధానం ఈ ప్రగతికి కారణమన్నారు. 38 జిల్లాల్లో ప్రభుత్వ పరంగా వైద్య కళాశాలలను స్థాపించడం జరిగిందని ఖమ్మంలో ఈరోజే వైద్య కళాశాల భవనాలను ప్రారంభించుకోవడం జరిగిందన్నార. మమత కళాశాలల స్థాపనకు, విస్తృతికి ఎవరు తోడ్పాటునందించారో ఎవరు కాలు అడ్డం పెట్టారో మాకు తెలుసునని మాకు సహకరించిన వారికి సర్వద కృతజ్ఞులమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

సభలో పువ్వాడ అజయ్ మాట్లాడుతూ 25 ఏళ్ల నాడు మమత కళాశాల స్థాపన కొరకు ఢిల్లీ వెళితే మా వద్దకు రావద్దంటూ చెప్పిన వారే ఇప్పుడు మమత సంస్థల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. యునైటెడ్ ఫ్రంట్ పాలనలో నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు తమకు పూర్తిగా సహకరించారని రజకోత్సవ వేళ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మమత సంస్థల విస్తృతికి ముఖ్యంగా 2018లో హైదరాబాద్లోని బాచ్పల్లిలో మమత కళాశాలను స్థాపించడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ తోడ్పాటు మరువలేనిదన్నారు. ఆయనే కళాశాల ఏర్పాటుతో పాటు ప్రదేశం కూడా చూపించారని అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు బాచ్పిల్లి కళాశాల కూడా పిజి కోర్సులను నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మమత సంస్థలు దోహదపడ్డాయన్నారు.

ఇదే సందర్భంలో చంద్రబాబు అరెస్టును మంత్రి అజయ కుమార్ తీవ్రంగా ఖండించారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం కక్ష సాధింపే అన్నారు. విచారణ జరపవచ్చు కానీ ఇది పద్దతి కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రిపై అవాక్కులు చేవాక్కులు పేలిన ఏ ఒక్కరి పైన కక్షసాధింపుగా వ్యవహరించ లేదని పువ్వాడ గుర్తు చేశారు. ప్రజల ఆదరాభిమానాలతో మమత కళాశాలలను మరింత అభివృద్ధి పరుస్తామని ఆయన తెలిపారు. ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ పువ్వాడ నాగేశ్వరరావు దురదృష్టి సంస్థలు ఈ స్థాయికి 1/2 ఎదిగేందుకు కారణమని ఆయన తెలిపారు.

మూడవ తరం కూడా మమత సంస్థల బాధ్యతలను నిర్వర్తించడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి తయారయ్యే వైద్యులు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా కాపాడనున్నారని నామ తెలిపారు. ఈ సభలో మమత సంస్థల డైరెక్టర్లు పువ్వాడ విజయలక్ష్మి. పువ్వాడ వసంతలక్ష్మి, పువ్వాడ నరేన్, నయన్ రాజ్, ఎంపిలు వద్దిరాజు

రవిచంద్ర, బండి పార్ధసారధి రెడ్డి, ఎంఎల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధు, ఎంఎల్ఎ లు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియా నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, మేయర్ పునుకొల్లు నీరజ, నుడా ఛైర్మన్ బచ్చు విజయకుమార్, డిసిసిబి, డిసిఎంఎస్ ఛైర్మెన్లు కూరాకుల నాగభూషణం, రాయల వెంకట శేషగిరి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులను ఆదుకోవాలి

Murali Krishna

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీ పంచమి వేడుకలు

Satyam NEWS

స్టోరీ కంటిన్యూస్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అర్హత లేదు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!