38.2 C
Hyderabad
April 28, 2024 20: 05 PM
Slider మహబూబ్ నగర్

చారిత్రక ప్రదేశంగా రాజుల కాలం నాటి అతి పురాతన లింగంబావి

#lingambavi

గద్వాల మున్సిపాలిటీ లోని 31వ వార్డులోని రాజుల కాలం నాటి పురాతన లింగంబావిని శనివారం మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ పరిశీలించారు. త్వరలో జరగబోయే గద్వాల పెద్ద జాతర సందర్బంగా లింగంబావి చుట్టు పక్కల వున్న పిచ్చి మొక్కలను తొలగించి వివిధ రకాల పూల మొక్కలను రంగు రంగులతో నూతనంగా ముస్తాబు చేయాలనీ మున్సిపల్ అధికారులకు చైర్మన్ కేశవ్ ఆదేశించారు.

ఈ సందర్బంగా చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే గద్వాల పెద్ద జాతర శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలను గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడికి ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు.

లింగంబావి చుట్టు వున్న పిచ్చి మొక్కలను తొలగించి వివిధ రకాల పూల మొక్కలను నాటి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పే విధంగా పచ్చని చెట్లతో అన్ని కొత్త హంగులతో రంగురంగులతో లింగంబావిని విద్యుత్ దీపాలతో  ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులకు చైర్మన్ కేశవ్ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు,టీ.శ్రీను నరహరి గౌడ్ నాగరాజు కృష్ణ మహేష్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోటేష్ నాగులుయాదవ్ బొట్టు సుధాకర్ రిజ్వాన్,మున్సిపల్ అధికారులు డి.ఇ. ఏ.ఇ. మరియు జవాన్లు పాండు పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

చెత్త పలుకు:నిజం అంగీకరించినందుకు థ్యాంక్స్

Satyam NEWS

దటీజ్ మోడీ: అరుణ్ శౌరీని పరామర్శించిన ప్రధాని

Satyam NEWS

ఉపాధ్యాయ స‌మ‌స్య‌ల‌ సాధనకు ప్ర‌భుత్వంపై యుద్దానికి కార్యాచర‌ణ‌

Satyam NEWS

Leave a Comment